ఆంధ్రప్రదేశ్‌

గిరిజన సాహిత్యం ముద్రణకు ఆర్థిక సహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబరు 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన సాహిత్యం ముద్రణ విషయంలో చేయూతను అందించేందుకు సంకల్పించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, సృజనాత్మక, సంస్కృతి సమితి (రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ) విజయవాడ సంచాలకులు విజయభాస్కర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ ఉప ప్రణాళిక పథకం కింద గిరిజన సాసిత్యం ముద్రణకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలోని గిరిజన రచయితలు, సాహితీ వేత్తలు, కవుల నుంచి వారి రచనలను ముద్రించుకునేందుకు ఆర్థిక సహాయానికై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఈ విధంగా ఆర్థిక సహాయం కోరే రచనలు గతంలో ఏ పత్రికల్లోను ముద్రించి ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. వారు ముద్రించే రచనల ప్రతులను వారి దరఖాస్తుకు విధిగా జతపర్చి ఆ దరఖాస్తులను 2018 జనవరి 31వ తేదీ లోగా సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ, ఘంటసాల ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల భవనం, 2వ అంతస్తు, దుర్గాపురం, విజయవాడ - 520003కు పంపాల్సిందిగా కోరారు.