ఆంధ్రప్రదేశ్‌

దోషులను వదిలిపెట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: తుని ఘటనలో అరెస్ట్ చేసిన దోషులను విడుదల చేయడం సాధ్యం కాదని హోం మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. శనివారం ఆయన సిఎంఓ మీడియా పాయింట్‌లో విలేఖరులతో మాట్లాడుతూ దోషులను కోర్టులో ప్రవేశపెట్టారని, వారికి రిమాండ్ విధించారని చెప్పారు. అందువలన ఇప్పుడు వారి విడుదల తమ చేతుల్లో లేదని అన్నారు. సిబిఐ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, ముద్రగడ అందుకు అంగీకరించడం లేదని అన్నారు. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మంజునాథన్ కమిషన్ ఆగస్ట్‌లో నివేదిక ఇవ్వనుందని ఆయన చెప్పారు. ముద్రగడ ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. కాపుల సంక్షేమానికి గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనివిధంగా చంద్రబాబు కార్యాచరణ రూపొందించారని అన్నారు. ప్రతిపక్ష నేతతో కుమ్మక్కై ముద్రగడ ఈ విధంగా దీక్షలు చేయడం సరికాదని, ఆయన వెంటనే దీక్ష విరమించాలని చినరాజప్ప కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇందుకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని హోం మంత్రి చెప్పారు. ప్రభుత్వం తరపు నుంచి తాము చెప్పాల్సింది చెప్పామని, ఆ తరువాత ముద్రగడ ఇష్టమని ఆయన అన్నారు.
కక్షసాధింపు కాదు: గంటా
విశాఖపట్నం: తుని ఘటనలో అరెస్టులు కక్షసాధింపు ఎంతమాత్రం కాదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తుని ఘటనపై సిఐడి సమగ్ర విచారణ జరిపిన మీదటే అరెస్టులకు సిద్ధపడిందన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరమే వారిని అరెస్టు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ కర్తవ్యమని, అతిక్రమించిన వారెవరైనా అరెస్టుకాక తప్పదని మరోసారి ఉద్ఘాటించారు. శాంతి భద్రతల పరిరక్షణలో దోషులని తేలితే ఎవరినీ వదిలేది లేదన్నారు. శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, మంత్రిగా పనిచేసిన ముద్రగడకు అప్పట్లో కాపు సామాజిక వర్గం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చేందుకు మంజునాథ కమిషన్‌ను ప్రభుత్వం నియమించిందని, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.1000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామన్నారు. కేవలం విపక్షాల రాజకీయ కుట్రలో ఉద్యమనేత ముద్రగడ చిక్కుకున్నారన్నారు.

చిత్రం మీడియాతో మాట్లాడుతున్న చినరాజప్ప