ఆంధ్రప్రదేశ్‌

ఆందోళనలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు కొత్తపల్లి, జూన్ 12: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు కొత్తపల్లి మండల కాపు సంఘ నాయకులు సంఘీభావంగా చేపట్టిన ఆందోళనలో అపశృతి చోటుచేసుకుంది. ముద్రగడ పద్మనాభంను ఉద్దేశ్యపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిందని కాపు సంఘ నేతలు ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ ఒక కాపు సోదరుడు ఆకస్మికంగా మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో ముద్రగడ పద్మనాభం అరెస్టును ఖండించేందుకు సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమయంలో ముద్రగడ పద్మనాభం అనారోగ్యం, అరెస్టుపై ఉద్వేగభరితంగా మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి చెందిన మేడిశెట్టి నూకరాజు అలియాస్ బాబులు (40) మృతిచెందాడు. దీంతో కొండెవరంలో కాపుసంఘ నేతలు గాది వీరభద్రరావు, మేడిశెట్టి శ్రీరాములు, కొనమర్తి సుబ్బారావు, మామిడి మల్లిబాబు తదితరులు విచారం వ్యక్తం చేశారు. అలాగే గొల్లప్రోలుకు చెందిన కాపు నేతలను అరెస్టు చేసి కొత్తపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో కాపు సామాజిక నేతలు అధిక సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ప్రభుత్వ చర్యలను, అక్రమ అరెస్టులను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.