ఆంధ్రప్రదేశ్‌

సంక్రాంతి బిజీకి స్పెషల్ రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: రానున్న సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్‌ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక బస్సులు, రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించాయి. హైదరాబాద్ నగరం నుంచి రెండు రాష్ట్రాలకు పండుగకు తరలి వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుంది. దీన్ని గమనించి టీఎస్‌ఆర్టీసీ 3262 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖ, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు తదితర ప్రాంతాలకు 1352 బస్సులను ఈనెల 10నుంచి 13 వరకు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాలకు 1910 ఆర్టీసి సర్వీసులను నడుపుతున్నట్లు వెల్లడించింది. అదనపు బస్సులకు అడ్వాన్స్ టిక్కెట్ రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు తెలిపింది.
వివిధ గమ్యస్థానాలకు 84 ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే వివిధ గమ్యస్ధానాలకు 84 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో తిరుపతి నుంచి ఏసీ ప్రత్యేక రైలు బయలుదేరి తర్వాతి రోజు విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో జనవరి 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో తిరుపతి నుంచి ప్రత్యేక ఏసీ రైలు బయలుదేరుతుంది. కాగా కాచిగూడ- విశాఖ మధ్య నాలుగు, విశాఖ- తిరుపతి మధ్య 4, తిరుపతి- కాచిగూడ మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడపనుంది. హైదరాబాద్- విశాఖ- హైదరాబాద్ మధ్య 4 రైళ్లను జనవరి 10, 12, తిరుగు ప్రయాణంలో 11, 13 తేదీల్లో నడుపుతున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్- దర్భంగా మధ్య, దర్భంగా -సికింద్రాబాద్ మధ్య 34 సర్వీసులు, హైదరాబాద్- రక్సల్ మధ్య, రక్సల్ హైదరాబాద్ మధ్య 18 సర్వీసులు నడపనున్నట్టు రైల్వే ప్రకటించింది.