ఆంధ్రప్రదేశ్‌

‘జన్మభూమిలో పర్యాటక, సాంస్కృతిక శాఖ పోటీలకు విశేష స్పందన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 3: జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా పర్యాటక సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న జన్మభూమి నేపథ్య అధారిత సాంస్కృతిక పోటీలకు విశేష స్పందన లభిస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. విద్యాశాఖ సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తుండగా ప్రతి చోట విద్యార్థులు, యువత నుండి స్పందన లభిస్తోందన్నారు. సంగీతం, నృత్యం, ముకాభినయం, కథలు చెప్పటం, పద్యాలు, శ్లోకాల పఠనం, చర్చ, వ్యాసరచన, పాటల రచన, కథా రచన, నినాదాల కూర్పు, కవిత్వం, చిత్ర లేఖనం అంశాలలో తొలుత గ్రామ, వార్డు స్థాయిలో పోటీలు జరుగుతున్నాయని మీనా పేర్కొన్నారు. మూడు కేటగిరీలుగా విద్యార్థులను విభజించామన్నారు. ఐదు నుండి ఎనిమిదవ తరగతి వరకు విభాగం ఒకటిగా, తొమ్మిది నుండి ఇంటర్మీడియెట్ వరకు విభాగం రెండుగా, డిగ్రీ విద్యార్థులకు విభాగం మూడుగా ఉన్నాయన్నారు. విద్యాశాఖ నేతృత్వంలో కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. తొమ్మిదో తేదీతో గ్రామ స్థాయి పోటీలు ముగియనుండగా విజేతలకు పదో తేదీన మండల స్థాయి పోటీలు నిర్వహిస్తారని ఇక్కడ కూడా ప్రతిభ చూపిన వారికి 11వ తేదీన మండల స్థాయిలో జరిగే కార్యక్రమంలో ప్రభుత్వ పరంగా ధృవీకరణ పత్రాలు అందజేస్తామని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. మండల స్థాయి విజేతలకు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీల నిర్వహణ క్యాలెండర్‌ను త్వరలో విడుదల చేస్తామని, అయితే ఉగాది వేళ వీరికి బహుమతుల పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి విజేతలకు అక్కడి ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర స్థాయి విజేతలకు స్వయంగా ముఖ్యమంత్రి పురస్కారాలు అందిస్తారన్నారు. మరోవైపు బహుమతులు పొందిన అంశాలపై ప్రత్యేకంగా పత్రం తయారు చేసే బాధ్యతలను భాషా సాంస్కృతిక శాఖ తీసుకుంటుందని, ఆ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు వీటిని ఈ విభాగానికి పంపవలసి ఉంటుందన్నారు.