ఆంధ్రప్రదేశ్‌

నాణ్యమైన విద్యాబోధనకే ప్రాధాన్యం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 13: విద్యావ్యవస్థలో భాగస్వామ్యమవుతున్న పాఠశాలల యాజమాన్యాలు నాణ్యమైన విద్యాబోధనకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య పిలుపునిచ్చారు. సోమవారం నగరంలో ఒక ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయంతో విశాఖ సేవా సదన్ ప్రాథమిక పాఠశాలలో పునర్నిర్మించిన తరగతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక విద్య అన్ని చదువులకు పునాది వంటిదని, విద్యార్థులపై అనవసర భారం మోపకుండా మంచి ఉన్నత ప్రయోగాలతో నాణ్యమైన విద్యనందించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, విద్యపై విద్యార్థులు మక్కువ పెంచకునేలా విద్యాబోధన జరగాలన్నారు. చాలాచోట్ల విద్యార్థులు చదువుల ఒత్తిడిలో బాల్యాన్ని కోల్పోతున్నారని, అటువంటి విధానాన్ని రూపుమాపడానికి, చదువంటే ఆసక్తి కలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు.