ఆంధ్రప్రదేశ్‌

లడ్డూ రేటు పెంపు కష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మార్చి 18: తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి విరాళం ప్రాతిపదికన బంగారు రేకులను తాపడం చేస్తామని టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. తిరుమల్లోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన టిటిడి పాలక మండలి సమావేశం అనంతరం ఆయన బోర్డు నిర్ణయాలను విలేఖరులకు తెలియజేశారు. శ్రీవారికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించదలచిన రూ.5కోట్ల విలువగల సాలిగ్రామ హారం, ఐదు పేటల కంఠాభరణం తయారు చేయడానికి అనుమతి ఇచ్చేందుకు బోర్డు అంగీకరించినట్లు తెలిపారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలం, మన్నార్ పోలూరు గ్రామంలోని పురాతనమైన శ్రీ అలఘమల్లారి కృష్ణ స్వామి వారి ఆలయాన్ని భక్తుల విన్నపాల మేరకు టిటిడి పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించామన్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీ భండారకెరె మఠం పీఠాధిపతికి ఇకపై ఉడిపికి చెందిన పాలిమర్ మఠం పీఠాధిపతితో సమానంగా ఆలయ మర్యాదలను సంక్రమింపజేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. విజయనగరంలోని టిటిడి కల్యాణమండపం పక్కనే ఉన్న పుష్పగిరి నేత్ర సంస్థకు కేటాయించిన టిటిడి స్థలానికి లీజు మొత్తాన్ని నిర్ణయించేందుకు బోర్డు సభ్యులు హరిప్రసాద్,్భనుప్రకాష్, రమణతోపాటు తిరుమల జెఇఓ, ఎస్టేట్ ఆఫీసర్, సిఎంఓలతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రూ.3.35 కోట్ల వ్యయంతో కడప నగరం దేవుని కడపలో, రూ.3.37 కోట్లతో నెల్లూరు జిల్లా పెంచలకోనలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయప్రాంగణంలో యాత్రికులకు సత్రాలను నిర్మించి ఇచ్చేందుకు, రూ.2.80 కోట్లుతో తిరుమల రెండో ఘాట్ రోడ్డులో బిటి రోడ్డు వేసేందుకు టెండర్లను ఆమోదించమన్నారు. రూ.2.55 కోట్ల వ్యయంతో పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణానికి అనుమతి ఇచ్చామన్నారు.