ఆంధ్రప్రదేశ్‌

విరామం తరువాత చేపల వేటకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 13: దాదాపు 45 రోజుల విరామం తరువాత చేపల వేటను బుధవారం నుంచి ప్రారంభించేందుకు మత్స్యకారులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. మంగళవారం గంగమ్మతల్లికి పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యసంపద పునరుత్పత్తికి వీలుగా మే 31 నుంచి జూన్ 15 వరకూ రాష్ట్రంలోని మత్స్యకారులు వేటకు విరామం ఇస్తుంటారు. విరామం ముగుస్తుండటంతో చేపల వేట ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. విశాఖలో 700 మెకనైజ్డ్ బోట్లు, 2000 వరకూ మోటార్డ్ బోట్లు ఉన్నాయి. ఒకసారి వేటకు వెళ్తే దాదాపు సముద్రంలో రెండు వారాల పాటు వేట సాగించి ఒడ్డుకు వస్తారు. అన్ని రోజులు చేపలు నిల్వ చేసేందుకు తగిన ఐస్, డీజల్, సిబ్బందికి ఆహారాన్ని బోట్ల వద్దకు సోమవారం నుంచి తరలిస్తున్నారు.

చిత్రం చేపల వేటకు సమాయత్తంగా బాక్సుల్లో నింపుతున్న ఐస్