ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జనవరి 12: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రకరకాల పుష్పాలు, తోరణాలతో మల్లన్న, భ్రమరాంబిక అమ్మవారి ఆలయాలను ముస్తాబు చేశారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఉదయం యాగశాలలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజస్తంభం వద్ద నంది వాహనం ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో నారాయణ భరత్‌గుప్తా, అర్చక వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహిస్తారు. రాత్రి స్వామి అమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు దేవస్థానం వారు విస్తృత ఏర్పాట్లు చేశారు.

చిత్రం..శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా
శుక్రవారం ధ్వజారోహణానికి ముందు ధ్వజపటానికి పూజలు చేసిన దృశ్యం