ఆంధ్రప్రదేశ్‌

నీతిమంతులను ఎన్నుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 13: అవినీతి ప్రజాస్వామ్యానికి పెద్దశత్రువుగా మారిందని భారతదేశ ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో శనివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల్లో నీతివంతమైన నాయకులను ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. కులం కన్నా గుణం గొప్పదని, అయితే ప్రస్తుత రాజకీయాల్లో కులం, మతం, ధనంకే ప్రాధాన్యత సంతరించుకున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించుకోవాలంటే గుణం ఉన్నవారికే పట్టం కట్టాలన్నారు. ఆధ్యాత్మిక భావనకు ప్రతి రూపం సేవ అని, నాయకులు, ప్రజలు కొంత సమయం, కొంత నగదు వెచ్చించి సమాజానికి తమ వంతు సహా యం అందించాలని సూచించారు. సేవా కార్యక్రమాల నిర్వహణతో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. సమాస్త మానవాళి జీవితం ప్రకృతితో ముడిపడి ఉందని, ఆరోగ్యకర జీవనానికి మంచి వాతావరణం అవసరమని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి తనలోని శక్తి సామర్థ్యాలను పెంచుకుంటే ఎంతటి స్థానానికైనా చేరవచ్చని, ఇందుకు అబ్ధుల్ కలాం, నరేంద్రమోదీలు ప్రత్యక్ష ఉదాహరణలన్నారు. తాను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి భారత ఉపరాష్టప్రతి స్థాయికి చేరానని గుర్తు చేశారు. పేద కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివి కలెక్టర్ అయిన ముత్యాలరాజు అందరికీ ఆదర్శమన్నారు. ప్రజలు ఆర్యోగంగా ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. ప్రజలు ఆహార అలవాట్లలో మార్పులు, మారుతున్న జీవన విధానంతో కొత్తవ్యాధులు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు శారీరక శ్రమను పెంచుకోవాలన్నారు. కష్టపడి పని చేస్తే వ్యాధులు దూరంగా ఉంటాయన్నారు. పేదలకు, గ్రామీణ ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో స్వర్ణ్భారత్ ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, గ్లోబల్ అసుపత్రి ఛైర్మన్ రవీంద్రనాథ్, స్వర్ణ్భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్, పలువురు వైద్యులు పాల్గొన్నారు.

చిత్రం..ఉచిత వైద్య శిబిరంలో ప్రసంగిస్తున్న ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు