ఆంధ్రప్రదేశ్‌

జల క్రీడలతో నూతన శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, జనవరి 13: నవ్యాంధ్రప్రదేశ్‌లో జల క్రీడల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మం త్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో రూ.3 కోట్ల తో నిర్మించనున్న రాష్ట్ర జల క్రీడల అకాడమీ భవన సముదాయానికి శనివారం శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశా రు. అనంతరం శ్రీరామపాద క్షేత్రం వద్ద రెండు రోజుల పాటు నిర్వహించనున్న సంప్రదాయ పడవల రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవీం ద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో విస్తారంగా ఉన్న సముద్ర తీరాన్ని అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. జల క్రీడల నిర్వహణకు నాగాయలంక వేదిక కావడం హర్షణీయమన్నారు. ఈ అకాడమీ ద్వారా ఆసక్తి కలిగిన వారికి జల క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామన్నా రు. జల క్రీడలను ప్రోత్సహిస్తూ నాలుగు ప్రాం తాల్లో అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కృష్ణాజిల్లాలో నాగాయలంక, ఇబ్రహీంపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రకాలువ, విజయనగరం జిల్లా తాడిపూడి వద్ద ఈ అకాడమీలను ప్రభుత్వం నిర్మించనుందని తెలిపారు. ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ ఈవెంట్స్‌లో జలక్రీడలకు సంబంధించి 58 పతకాలు ఉన్నాయన్నారు. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో జల క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు. పడవ పందాల్లో కేరళ అంతర్జాతీయ ఖ్యాతి గడించింద ని, యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తోందని అన్నా రు. మన రాష్ట్రానికి గల అపారమైన సముద్ర తీరంలో జలక్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశం తో నాగాయలంకలో జల క్రీడల అకాడమిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాగాయలంక లైట్‌హౌస్‌ను కేంద్రం సాగరమాల కింద గుర్తించిందన్నారు. హౌస్ బోట్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఫిబ్రవరి 10,11 తేదీ ల్లో శ్రీకాకుళంలో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఘంటసాలలో శయన బుద్ధ విగ్రహాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పడవ పోటీల నిర్వహణలో స్వచ్ఛ నాగాయలంక సొసైటీ, గ్రామాభివృద్ధి కమిటీ వారికి అభినందనలు తెలిపారు. బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ వనరులను వినియోగించుకుని జల క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు.

చిత్రం..జల క్రీడల అకాడమీ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి రవీంద్ర, ఉపసభాపతి బుద్ధప్రసాద్ తదితరులు