ఆంధ్రప్రదేశ్‌

బాబు దుష్టపాలనకు చరమగీతం పాడుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న చంద్రబాబు దుష్టపాలనకు చరమగీతం పాడుదామని ప్రతిపక్ష నేత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 61వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం చిత్తూరూ జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువుపేట గ్రామం నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర కుప్పంబాదూరు, వడ్డికాలువ, బలిజపల్లి, సంజీవరాయపురం, పీవీ పురం, రామిరెడ్డిపురం, గంగిరెడ్డిపల్లి, రామచంద్రాపురం, నడవలూరు గ్రామాలమీదుగా సాగింది. మొత్తం 12కిలోమీటర్ల మేర అభిమానులను, ప్రజలను కలుసుకుంటూ, పలకరిస్తూ యాత్ర సాగించారు. సాయంత్రం 4.30 గంటలకు రామచంద్రాపురం మండల కూడలిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతున్నదని, దీనిని అంతమెందించడానికే మీ రాజన్న బిడ్డనైన నేను పాదయాత్రను కొనసాగిస్తున్నానని, అందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. రాజన్న పాలన నాటి పచ్చదనం ఏమైందని ప్రశ్నించారు. భయపడకండి... భవిష్యత్ మనదే అని అందరికీ భరోసా ఇచ్చారు. చంద్రబాబు పాలనలో అందరికీ సంతోషం కరవైందని, రాబోవు కాలం లో భరోసా ఇవ్వడానికి తాను వస్తే తనకే భరోసా కల్పిస్తున్న మీ అందరికీ వందనాలన్నారు. చంద్రబాబు మంచి పరిపాలనా దక్షుడంటారు. అంటే సొంత నియోజకవర్గంలో ఓడిపోవడమా ?, పరాయి నియోజకవర్గానికి పారిపోవడమా? అని ఎద్దేవా చేశారు. బాబు తన సొంత గ్రామంలోని పాఠశాలను బాగుపరచలేక దీనస్థితికి వదిలిపెట్టారని, దీనిని బట్టి రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉందో మీరే ఊహించండని పేర్కొన్నారు. నేటికీ రాష్ట్రంలో 70 శాతం గ్రామాలు తాగునీటికి నోచుకోలేని దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయన్నారు. బాబు అబద్దాలకు, మోసాలకు హద్దులేదు. రాజకీయంలో విశ్వసనీయత, నిజాయితీ రావాలని, ఇందుకోసమే రాష్టమ్రంతా ప్రజాసంకల్పయాత్ర సాగిస్తున్నానని చెప్పారు. రాబోవు ఎన్నికల్లో రాజన్న పాలన రావాలంటే జగననే్న ముఖ్యమంత్రి కావాలని అందరూ దేవుణ్ణి ప్రార్థించాలని కోరారు.

చిత్రం..రామచంద్రాపురంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి