ఆంధ్రప్రదేశ్‌

ట్రెజరీ స్కాంపై విచారణ ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 14: ప్రభుత్వానికి గుండెకాయ వంటి రాష్ట్ర ట్రెజరీ శాఖలో దొంగలు పడిన ఏడాది కాలం తర్వాత మేలుకున్న ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేసింది. అయితే ఉన్నతాధికారులు ఆదిలోనే కళ్లు తెరచి ఉంటే వందల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ సొమ్ము నిలువుదోపిడీకి గురయ్యేది కాదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పోలీసు కేసులు నమోదు కాగా, బాధ్యులు కొందరు సస్పెన్షన్‌కు గురయ్యారు. మరోవైపు శాఖాపరమైన ఉన్నతస్థాయి విచారణ జరుగుతున్న నేపథ్యంలో పర్యవేక్షణాధికారులు ఎలాంటి చార్జిమెమోలను కూడా అందుకోకుండానే పదవీ విరమణ చేస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నిరకాల ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. మరికొందరు డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లో కీలక పదవులు రాబట్టుకోవటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక నేరాలు జరిగిన ఒక్కో కార్యాలయంపై ఒక్కో ఉన్నతాధికారితో జరిపిస్తున్న శాఖాపరమైన విచారణ ట్రెజరీ శాఖ డైరెక్టర్ మోహనరావు ఆధ్వర్యంలో వేగవంతమైంది. వివిధ జిల్లాల్లో కోట్లాది రూపాయల మేర కుంభకోణాలు జరిగిన సమయంలో ఖజానా శాఖ రాష్ట్ర డైరెక్టర్‌గా వ్యవహరించిన కల్పవల్లి ఇటీవలే పదవీ విరమణ చేశారు. విశాఖ జిల్లా సీతమ్మధార, చింతపల్లి ట్రెజరీ కార్యాలయాల్లో దాదాపు రూ.30కోట్ల మేర కుంభకోణం జరిగింది. ఔట్‌సోర్సింగ్‌లో కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసేది ఒకరైతే 10 మంది బినామీల పేర్లతో ప్రభుత్వ సొమ్ము డ్రా అయింది. అలాగే ఏనాడో మరణించినవారి పేర్లపై కూడా పెన్షన్లు జారీ అయ్యాయి. ఈ భారీ స్కాంపై నమోదైన పోలీసు కేసులో జిల్లా ట్రెజరీ అధికారి గీతాదేవి 53వ ముద్దాయిగా ఉండగా ప్రస్తుతం ఆమెను డిప్యుటేషన్‌పై వేల కోట్లు బడ్జెట్‌తో కూడిన రాష్ట్ర బీసీ కార్పొరేషన్ లో కీలక పోస్టులో నియమించారు. దీర్ఘకాలిక సెలవులో ఉన్న గుంటూరు జిల్లా ట్రెజరీ అధికారి సురేంద్రబాబు ఇటీవల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా డిప్యుటేషన్‌పై నియమితులయ్యారు. ఈయన హయాంలో గుంటూరు కార్యాలయంలో కామేశ్వరి అనే ఒక మహిళ ఖాతాకు ప్రభుత్వ శాఖల నుంచి 10లక్షల రూపాయలు జమ కావటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. వివిధ జిల్లాల్లో బాధ్యులైన సిబ్బం ది అనేకమంది ఒకరి తర్వాత మరొకరు పదవీ విరమణ చేస్తున్నందున శాఖాపరమైన దర్యాప్తు త్వరితగతిన పూర్తిచేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ట్రెజరీ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు.