ఆంధ్రప్రదేశ్‌

గోపూజలో ఉప రాష్టప్రతి దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, జనవరి 16 : భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపరాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ సరస్వతి నగర్ వద్ద ఉన్న అక్షర విద్యాలయ పాఠశాలలో సోమవారం సంక్రాంతి పర్వదినం సందర్భంగా గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు, ఆయన సతీమణి ఉషమ్మ, కుమారై దీపావెంకట్, కుమారుడు హర్షవర్దన్‌నాయుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. కొందరు భారతీయులు మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచి పరదేశ సంస్కృతి సంప్రదాయాలకు బానిసలవుతున్నారని ఆయన అందోళన వ్యక్తం చేశారు. మాతృదేశాన్ని, మాతృభాషను, కన్న తల్లి, సొంత గ్రామాన్ని మరవవద్దని సూచించారు. ముగిసిన వెంకయ్యనాయుడు పర్యటన
ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఈ నెల 11న సాయంత్రం వెంకటాచలం వచ్చిన ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు మంగళవారం ఉదయం వరకు స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లోనే ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ఈ నెల 12న అక్షర విద్యాలయం, స్వర్ణ్భారత్ ట్రస్టులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడుతో కలిసి తమిళనాడు గవర్నర్ భవ్వర్‌లాల్ పురోహిత్ తదితరులు ఉన్నారు. 13న స్వర్ణ్భారత్ ట్రస్టులో ట్రస్టు ఆధ్వర్యంలో చెన్నై గ్లోబల్ ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించి మాట్లాడారు. అదే రోజు బంధువులు, ఆత్మీయులు, తమ స్వగ్రామానికి చెందిన ప్రజలు, గ్రామస్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం వెంకయ్యనాయుడును పలువురు ప్రముఖులు, స్నేహితులు, జిల్లా వాసులు, స్వగ్రామానికి చెందినవారు, అధికారులు ప్రత్యేకంగా సన్మానించారు.