ఆంధ్రప్రదేశ్‌

క్లౌడ్ హబ్ పాలసీకి కేబినెట్ ఓకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: డేటా సెంటర్లు, ఆర్ట్ఫిషల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చెయ్యడమే లక్ష్యంగా క్లౌడ్ హబ్ పాలసీ 2018-2020ని ప్రభుత్వం రూపొందించింది. ఈ పాలసీకి వెలగపూడి సచివాలయంలో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డేటా సెంటర్లు, ఆర్ట్ఫిషల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ హబ్ కంపెనీల ద్వారా 2020కి రాష్ట్రానికి 32,500 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పాలసీ రూపొందించారు. అత్యాధునిక సాంకేతిక పరీక్షా కేంద్రాలు డ్రైవర్‌లెస్ కార్లు, డ్రోన్లు, ఫిన్‌టెక్, స్మార్ట్ సిటీస్ లాంటి టెక్నాలజీని పరీక్షించే అవకాశం కల్పించడం, ఆర్ట్ఫిషల్ ఇంటెలిజెన్స్‌లో నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి జరిగేలా ప్రోత్సాహం అందించడం వంటివి ఈ పాలసీలో భాగంగా ఉంటాయి. డేటాకు గోప్యత, భద్రత కల్పించడం కూడా ఒక అంశం కానుంది. ఉద్యోగాల కల్పన ఆధారంగా రాయితీ ఇవ్వనున్నారు. పూర్తిస్థాయి వౌలిక వసతులు కల్పించిన అభివృద్ధి చేసిన భూమి, విద్యుత్, ఫైబర్ కనెక్షన్, నీటి సౌకర్యం కల్పిస్తారు. స్టేట్ జీఎస్టీలో 50 శాతం సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ, 2 గ్రిడ్ల నుండి విద్యుత్ సరఫరా కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుండి 2 ఏళ్లపాటు రెండు రూపాయల విద్యుత్ సబ్సిడీ వంటివి పెట్టుబడిదారులకు కల్పిస్తారు. మూడు సంవత్సరాల పాటు 50 శాతం సబ్సిడీతో ఫైబర్ కనెక్షన్ ఇస్తారు. రూ.300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక రాయితీ ఇస్తారు. పేటెంట్ అప్లికేషన్ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. ఆర్ట్ఫిషల్ ఇంటెలిజెన్స్‌లో జరిగే పరిశోధన, అభివృద్ధికి ప్రధాన్యం ఇస్తారు.