ఆంధ్రప్రదేశ్‌

‘హోదా’తో ముడిపడి పొత్తులుండవు: సోము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 22: హోదాతో ముడిపడి ఎన్నికల పొత్తులు, రాజకీయాలు ఉండవని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తే తాను బీజేపీతో కలసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానన్న వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై సోము స్పందించారు. జగన్ వ్యాఖ్యలపై బీజేపీ వివరణ కోరగా, ప్రత్యేక హోదాను అనుసరించి పొత్తులుండవని వ్యాఖ్యానించారు. అయినా మేం టీడీపీతోనే ఉన్నాం. విడిపోలేదు కదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు భవిష్యత్తులో ఆ హోదా ఉండదని, కమిషన్ల సిఫార్సు వల్ల ఇకపై ఆ ప్రయోజనాలు రావని, హోదా ఇచ్చే కమిటీ ఇప్పుడు లేదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఈ విషయం రోజూ పత్రికలు చదివే అందరికీ తెలుసనన్నారు. ‘రాష్ట్రానికి మోదీ ఇచ్చిన హామీలన్నీ అమలవుతున్నాయి. హోదాను మించిన ప్యాకేజీ ఇస్తామన్నాం. ఇస్తున్నాం. ఇప్పటికి 4 వేల కోట్ల రూపాయలిచ్చాం. మరో రెండు, మూడు నెలల్లో మరో 2,3 వేల కోట్లు ఇస్తారన్న సమాచారం ఉంది. తర్వాత మరో 4 వేల కోట్లు ఇస్తామంటున్నారు.