ఆంధ్రప్రదేశ్‌

దేశాభివృద్ధికి విద్యుత్ దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 22: ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా విద్యుత్‌తోనే సాధ్యపడుతుందని, అటువంటి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ను ఏపీలోనే ముఖ్యమంత్రి చొరవతో ఇవ్వగలుగుతున్నామని విద్యుత్ శాఖామంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 12వ రాష్ట్ర మహాసభ ఏయు సీఆర్ కాన్వొకేషన్ హాల్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నాటికి దేశంలో విద్యుత్ పంపిణీ నష్టాలు 15 శాతానికి తగ్గించాలనేది లక్ష్యం కాగా, ఏపీలో ఇప్పటికే 9.11 శాతానికి నష్టాలు తగ్గించగలిగామన్నారు. దీన్ని ఇంకా 3.2శాతానికి తగ్గించాల్సి ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే నిరంతరాయ విద్యుత్‌ను మెరుగు పరిచామన్నారు. కోతలు విధిస్తే పరీక్షలకు ఇబ్బందులు వస్తాయని భావించి ఎటువంటి కోతలు లేకపోగా, మిగులు విద్యుత్‌కు చేరుకున్నామన్నారు. రెండవ విద్యుత్ సంస్కరణల్లో భాగంగా సూర్యరశ్మి, గాలిమరల ద్వారా విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతోనే తీసుకురాగలిగామన్నారు. ఏపీలో స్టోరేజీ సామర్థ్యం పెంచుకునే రోజులు రానున్నాయన్నారు. ఏపీకి చెందిన 1100 మంది ఉద్యోగులు తెలంగాణాలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సుప్రీంకోర్టు చెప్పినా జీతాలే తప్ప సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. దీనికి సంబంధించి ఏపీ జెన్‌కోతో చర్చలు జరుగతున్నాయన్నారు. సింగరేణి కేలరీస్‌కు సంబంధించి 3,500 కోట్ల విలువైన పన్నులు అక్కడ కట్టించుకుంటున్నారని, లోకేషన్ మాత్రం ఇక్కడ ఉన్నాయన్నారు. తెలంగాణాలో బీసీల పరిస్థితి ఏమీటని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసమే చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్షను పెట్టారన్నారు. రెవెన్యూ జనరేషన్, ఉద్యోగాలు సృష్టించుకోవడం తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ మనకు వచ్చాయన్నారు. 13 శాతం తక్కువ వర్షపాతం ఉన్నా 26 శాతం మేర పంటలు సాధించామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వాటా రాబట్టుకోవాల్సి ఉందన్నారు.

మంత్రి సభలో పవర్ కట్...
మంత్రి కిమిడి కళావెంకట్రావు ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయన కంగుతిన్నారు. దాదాపు పది నిమిషాలపాటు సరఫరా నిలిచిపోవడంతో చీకటిలోనే ప్రసంగాన్ని కొనసాగించారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న విద్యుత్ మంత్రి కిమిడి కళావెంకటరావు