ఆంధ్రప్రదేశ్‌

జనాభా తగ్గుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: వచ్చే పదేళ్ళలో పౌష్టికాహార సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, యునిసిఫ్ సంయుక్తంగా శుక్రవారం విజయవాడలో ‘చిన్నపిల్లల్లో పౌష్టికాహార సమస్య’ అంశంపై రాష్టస్థ్రాయి సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌష్టికాహారంపై కొంతమందికి మాత్రమే అవగాహన ఉందని, పేద కుటుంబాల్లో దీనిపై ఏమాత్రం అవగాహన లేదని అన్నారు. చాలావరకూ బతుకు తెరువు సమస్యే పిల్లల్లో పౌష్టికాహార లోపానికి కారణమవుతోందన్నారు. గర్భిణులకు తగిన పౌష్టికాహారం అందడం లేదని అన్నారు. గర్భిణులు నిర్లక్ష్యానికి గురవడం వలన తల్లి, బిడ్డ మరణాలు సంభవిస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియచేశారు. అన్న అమృత హస్తం, గిరి గోరుముద్దలు వంటి అనేక పథకాలను ఇందులో అమలు చేస్తున్నామని తెలిపారు. భారత దేశానికి, అందులోను ఆంధ్రప్రదేశ్‌కు యువతే ఆధారమని చంద్రబాబు చెప్పారు. చైనా, జపాన్, యూరప్ దేశాల్లో జనాభా తగ్గిపోతోంది. అదే సమస్య మన దేశంలో, అందులోనూ మన రాష్ట్రంలో తలెత్తబోతోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఒక్క బిడ్డతో కొంతమంది సరిపెట్టుకుంటున్నారని, మరికొందరు పిల్లలే వద్దనుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. పిల్లలే మన ఆస్తి అని అన్నారు. యువ దంపతులపై దృష్టి పెట్టనున్నామని ఆయన చెప్పారు. పౌష్టికాహార లోపాన్ని పదేళ్లలో నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రెండు, మూడేళ్లలో తగ్గుముఖం పడితే మరీ మంచిదని ఆయన అన్నారు. అసెంబ్లీ వేదికగా ఈ అంశాన్ని చర్చిస్తామని, అలాగే నూట్రీషియన్ మిషన్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలియచేశారు. కాకినాడలో సుమారు 6000 మంది పిల్లల్లో పౌష్టికాహార సమస్యను పరిష్కరించడానికి సిఐఐ ముందుకు రావడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ పౌష్టికాహార లోపం వలన ప్రపంచవ్యాప్తంగా 45 శాతం మంది చనిపోతున్నారని అన్నారు. బరువు తక్కువగా పుట్టిన బిడ్డలు కూడా జన్మించిన కొద్ది రోజుల్లోనే చనిపోతున్నారని అన్నారు. నిరక్షరాస్యత, పేదరికం కారణంగా పౌష్టికాహార సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ సమస్య దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని ఆయన తెలియచేశారు. ఢిల్లీ ఐఐటి నేషనల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంకె భాన్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లల్లో 16 శాతం మందికి రక్తపోటు, చక్కర వ్యాధి కలిగి ఉన్నారని చెప్పారు. ఈ పిల్లలు భవిష్యత్‌లో దీర్ఘ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. మన దేశంలో, ప్రధానంగా ఎపిలో పేదరికం, ఆకలి సమస్య అంతగా లేదని ఆయన చెప్పారు.

చిత్రం... చిన్నారుల ఆటపాటలను ఆసక్తిగా తిలకిస్తున్న సిఎం చంద్రబాబు