ఆంధ్రప్రదేశ్‌

ఆ ముగ్గురికి బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 18: తుని దుర్ఘటనకు సంబంధించి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ముగ్గురు కీలక నిందితులకు శుక్రవారం బెయిల్ మంజూరు కాలేదు. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణను తూర్పు గోదావరి జిల్లా సిఐడి కోర్టు ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. జిల్లా కేంద్రం కాకినాడ సిఐడి కోర్టులో శుక్రవారం బెయిల్ పిటిషన్ కేసు విచారణకు వచ్చింది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు అత్యంత సన్నిహితులైన వివై దాసు, నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణలు రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే! ఈ ముగ్గురు ఇదివరకే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఈనెల 17న సిఐడి కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో మరోసారి ముగ్గురూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం పిటిషన్ బెంచ్‌పైకి రాగా సిఐడి కోర్టు న్యాయమూర్తి కె శివశంకర్ విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేశారు. దీంతో కాపు నేతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తుని దుర్ఘటనకు సంబంధించి జైలులో ఉన్న 13 మందిలో 10 మంది నిందితులకు ఈనెల 17న బెయిల్ మంజూరైన విషయం తెలిసింది. మిగిలిన ముగ్గురికీ బెయిల్ వచ్చిన పక్షంలో ముద్రగడ దీక్ష విరమించడం తథ్యమని కాపు నేతలు ఆశించారు. అనూహ్యంగా సిఐడి కోర్టు కీలక నేతలైన దాసు, విష్ణు, రామకృష్ణలకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించి, పిటిషన్‌ను వాయిదా వేసింది. ఇదిలావుండగా కీలక నేతలైన పై ముగ్గురికి బెయిల్ మంజూరు కాకపోవడంతో ముద్రగడ తీవ్రంగా పరిగణించినట్టు తెలిసింది. సోమవారం ఈ బెయిల్ పిటిషన్ బెంచ్‌పైకి రానున్న నేపథ్యంలో ఆ రోజైనా బెయిల్ వస్తేనే ముద్రగడ దీక్ష విరమిస్తారని, బెయిల్ మంజూరు కాని పక్షంలో ముద్రగడ పట్టువీడే అవకాశం లేదన్న ఆందోళనలో కాపు నేతలున్నారు. మరోవైపు నిందితులకు బెయిల్ మంజూరు విషయంలో చట్టపరంగా సాగుతున్న ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ముద్రగడ దీక్ష 10వ రోజుకు చేరడంతో ఓవైపు వైద్యులు, మరోవైపు పోలీసులు రేయింబవళ్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా యంత్రాంగం కూడా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.