ఆంధ్రప్రదేశ్‌

విడిపోయి.. ఏం చేస్తాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 31: మిత్రపక్షమైన బీజేపీతో కలసి నడిచే విషయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు స్పష్టమైన సంకేతాలిచ్చారు. పార్టీ నేతలెవరూ బీజేపీపై నోరుజారి మాట్లాడవద్దని హెచ్చరించారు. ఒకవేళ బీజేపీ నుంచి బయటకు వచ్చి ఏం చేస్తామంటూ నేతలను ప్రశ్నించడం ద్వారా, ఆ పార్టీతో తన భవిష్యత్తు వ్యూహమేమిటో చెప్పకనే చెప్పారు. తన పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు, టీవీ చర్చల్లో పాల్గొనే దాదాపు 20 మందితో చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి వరకూ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ప్రజలు ఏమనుకుంటున్నారో వాకబు చేశారు. చర్చల్లో వారు అనుసరించాల్సిన వ్యూహం, మాట్లాడవలసిన తీరు, పార్టీ విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఓ సమయంలో తరచూ నోరుపారేసుకునే నేతలను మందలించారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీతో సంబంధాలపై ఇకమీదట ఎవరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని, ఆ పార్టీ నేతలను విమర్శించవద్దని చంద్రబాబునాయుడు తన పార్టీ నేతలను ఆదేశించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదని, దాని ప్రభావం తమ పార్టీపైనా పడుతున్నందున.. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవడమే మంచిదన్న అభిప్రాయం వివిధ వర్గాల్లో ఉందని ఓ నాయకుడు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దానితో సీరియస్ అయిన చంద్రబాబు ‘మీ కోరికలు పార్టీపై రుద్దకండి. ఒకవేళ నీ మాట ప్రకారం కేంద్రం నుంచి బయటకు వస్తే ఏమవుతుంది? ఆరోజుకు మీడియాలో బ్రహ్మాండంగా హైలెట్ అవుతుంది. నీ కడుపు ఉబ్బరం తగ్గుతుంది. నీ కోరిక నెరవేరుతుంది. ఆ తర్వాత స్టెప్ ఏమిటి? కేంద్రంలో మనకు దన్నుగా ఉన్న ప్రభుత్వం ఉంటేనే మనం ఇక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలం. అందుకే రాజకీయ పరిస్థితులు స్టడీ చేయమంటున్నా. వాళ్లు కొన్ని ఇస్తున్నారు. కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. అంతమాత్రం చేత నోరుపారేసుకోకూడదు. పోలవరంపై కొంచెం అటో ఇటో పనులు అవుతున్నాయంటే అది మన విధానం, లౌక్యం వల్లనే’ అని సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పోలవరంపై గతంలో ఉన్నన్ని సమస్యలు ఇప్పుడు లేవని, చర్చల ద్వారా దానిని ఓ కొలిక్కి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మనం బీజేపీతోనే ఉన్నామని, పొత్తుపై ఎవరు ప్రశ్నించినా.. అది రెండు పార్టీల జాతీయ నాయకత్వాలు చూసుకుంటాయని చెప్పాలన్నారు. రాజకీయాలు అధ్యయనం చేయకుండా మాట్లాడితే దెబ్బతింటామని శివసేనను ఉదహరించారు. మహారాష్టల్రో శివసేనపార్టీ కేంద్రంలో ఉంటూ, వచ్చే ఎన్నికల్లో విడిగా పోటీచేస్తామని చెప్పడం, కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీచేస్తామంటే ఎవరూ నమ్మరని ఉదహరించారు. కేంద్రం ఏమేమి ఇవ్వాలో, ఏమేమి ఇచ్చిందో, విభజన హామీలు చెప్పడంలో తప్పులేదన్నారు. ఒకవేళ బీజేపీ నేతలు కొందరు సొంత అజెండాతో మాట్లాడినా వాటికి విలువ ఉండదన్నారు.