ఆంధ్రప్రదేశ్‌

భవిష్యత్తుపై గిరిజనులకు భరోసా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 8: విధి నిర్వహణలో ఆత్మ సంతృప్తి కలిగేలా పనిచేస్తూ, గిరిజనులకు భవిష్యత్‌పై భరోసా కల్పించాలని గిరిజన సంక్షేమ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో గిరిజన సంక్షేమంపై రాష్ట్రంలో ఐటీడీఏ పీవోలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజనులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయన్నారు. మన్యంలో విద్య, ఆరోగ్యంపైనా, వౌలిక సదుపాయాల కల్పనపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తప్పించడానికి వెనుకాడేది లేదని హెచ్చరించారు. పలువురు డ్రాపౌట్ల నిరోధానికి గిరిజన విద్యార్థులకు ఇనె్సంటివ్‌లు ఇచ్చే ఆలోచన ఉందన్న సీతంపేట ఐటీడీఏ పీవో వ్యాఖ్యలను సీఎస్ తప్పుబట్టారు. ఎంతమందికి ఇనె్సంటివ్‌లు ఇస్తూ, పాఠశాలలకు రప్పించగలమని ప్రశ్నించారు.
పక్కాగా జనన, మరణాల రిజిస్టర్లు
రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల్లో జనన, మరణ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో మెటర్నిటీ బెనిఫిట్ స్కీం, జనన, మరణ సర్ట్ఫికెట్ల జారీ, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మాతాశిశు మరణాలకు సంబంధించిన సంఘటనలు జరిగితే వెంటనే సంబంధిత ఆధారిటీకి ఆ వివరాలను తెలియజేయాలని, వాటిపై సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల్లో జనన, మరణ సర్ట్ఫికెట్లను సకాలంలో జారీ చేయడంతోపాటు అందుకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
గ్రామాల్లో సిటిజన్ సర్వీస్ సెంటర్లు
రాష్ట్రంలో నేషనల్ రూర్బన్ మిషన్ కింద ఐదేళ్ల (2016-2020) కాలానికి ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో కనీస వౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం వెలగపూడి సచివాలయంలో ఈ పథకంపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి ఎంపవర్డ్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సిటిజన్ సెంట్రిక్ సేవలన్నీ ఇ-గ్రామ కనక్టివిటీ కింద పొందేందుకు వీలుగా అవసరమైన సిటిజన్ సర్వీసు సెంటర్లు (సీఎస్సీ) ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.