ఆంధ్రప్రదేశ్‌

ఆధార్ వాడిందెవరో తెలుసుకోవచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 12: ఆధార్ కార్డు వివరాలపై గోప్యతపై చర్చ జరుగుతున్న సమయంలో, ఆధార్ కార్డును గత ఆరు నెలల్లో ఎక్కడ ఉపయోగించారో తెలుసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆధార్ కార్డు దుర్వినియోగంపై ఆయా కార్డు యజమానులు నిఘా ఉంచే వీలు కలిగింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) అందచేస్తున్న ఈ సౌకర్యాన్ని గూగుల్ సెర్చ్ ద్వారా సులువుగా యాక్సెస్ చేయవచ్చు. గతంలో సెల్ ఫోన్ కనెక్షన్, ఇతర సందర్భాల్లో ఆధార్ కార్డు నకలును అందచేస్తే, దానిని దుర్వినియోగం చేసిన ఘటనలు అనేకం వెలుగు చూడటం తెలిసిందే. ఆధార్ కార్డు దుర్వినియోగం జరిగినా, ఆ కార్డు యజమానికి ఆ వ్యవహారం తెలిసే వీలు ఉండేది కాదు. ఏదైనా అక్రమం వెలుగుచూసినప్పుడు, తన కార్డు వినియోగించారని తెలుసుకుని తెల్లబోవడం ఆయా కార్డు యజమానుల వంతయ్యేది. ఈ సమస్యను అధిగమించేందుకు యుఐడీఏఐ ఒక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకున్న వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఒక ఆధార్ కార్డును ఉపయోగించి గత ఆరు నెలల్లో జరిగిన ఆథెంటికేషన్స్ (లావాదేవీలు) గరిష్ఠంగా 50 వరకూ తెలుసుకోవచ్చు. గూగుల్‌లో ఆధార్ నోటిఫికేషన్స్ అని టైప్ చేస్తే, వచ్చే రిజల్ట్స్‌లో ఆధార్ ఆథెంటిఫికేషన్ హిస్టరీ - రెసిడెంట్ యుఐడిఏఐ అని ఒక వెబ్ లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, అక్కడ యుఐడీఏఐకి చెందిన పేజీ వస్తుంది. అక్కడ ఆధార్ నెంబరు, పక్కనే ఉన్న సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి. తరువాత వచ్చే పేజీలో ఆథెంటికేషన్స్‌కు సంబంధించి ఏడు రకాల ఆప్షన్స్‌తో ఒక బాక్స్ వస్తుంది. అందులో ఆల్ అన్న ఆప్షన్‌ను ఎంచుకుని, ఏయే తేదీల మధ్య వివరాలు కావాలి, ఎన్ని ఆథెంటికేషన్స్ కావాలి అన్న వివరాలు నమోదు చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని కూడా నమోదు చేయగానే, మనం అడిగిన తేదీల మధ్య జరిగిన ఆథెంటిఫికేషన్స్, ఏ సంస్థకు సంబంధించి జరిగింది, సఫలం అయిందా? విఫలం అయిందా? ఎర్రర్ కోడ్ వంటివి వస్తాయి. ఆ వివరాలను పరిశీలిస్తే, మనం చేయని లావాదేవీలను గుర్తించవచ్చు. కొన్ని వివరాలు అనుమానాస్పదంగా ఉంటే, పోలీస్ లేదా ఇతర శాఖలకు ఫిర్యాదు చేసేందుకు వీలు అవుతుంది. బ్యాంక్, సెల్‌ఫోన్ కనెక్షన్, తదితర సందర్భాల్లో ఇచ్చే ఆధార్ నకలుపై ఎందుకు ఇస్తున్నామో రాస్తే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదని యుఐడీఏఐ అధికారులు చెబుతున్నారు.