ఆంధ్రప్రదేశ్‌

సాయంపై సమాచారానికి ఇంత యాగీ చేయాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: కేంద్రప్రభుత్వం సాయం అందించడంపై ఎవరూ యాగీ చేయాల్సిన పనే్లదని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి సుదీష్ రాంబొట్ల పేర్కొన్నారు. గురువారం నాడు బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. కేంద్రం ఏం సాయం చేస్తోందో ఎప్పటికపుడు విష్పష్టంగా చెబుతోందని అన్నారు. ఇంకా వివరాలు కావాలంటే ఎవరైనా సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఇంకా వివరాలు పొందే వీలుందని, దీని కోసం ఇంత వివాదం అక్కర్లేదని పేర్కొన్నారు. అడకుండానే సమాచారం ఇవ్వలేదని అనడం ఏమిటని అన్నారు. సినిమా సినిమా మధ్యలో ప్రెస్‌మీట్ పెట్టే హాలిడే లీడర్‌గా పవన్‌కళ్యాణ్ మారారని ఎద్దేవా చేశారు. ఇంత కాలం ఊరుకుని ఇపుడు రాష్ట్ర హోదా కోసం ఫైట్ చేస్తామని చెప్పడం ఏమిటని అన్నారు. వ్యవవహారం చూస్తుంటే బాహుబలి-2లా ఉందని అన్నారు. రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు ఇప్పటికే కేంద్రం ఇచ్చిందని, ఇంకా డిజైనే్ల పూర్తికాలేదని ఈ నిధులతో కోటి చదరపు అడుగుల భవనాలు నిర్మించవచ్చని, కాని అవేవీ కన్పించడం లేదని అన్నారు. అలాగే పోలవరం గురించి కూడా చర్చ జరపుతున్నారని, కేంద్రం అధికారంలోకి వచ్చిన తొలి క్యాబినెట్‌లోనే పోలవరం ముంపు ప్రాంతాలను చేర్చుతూ ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు.