ఆంధ్రప్రదేశ్‌

క్రాప్ హాలీడేకు మరో మండలం రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినవిల్లి, జూన్ 21: ఈ ఖరీఫ్‌లో క్రాప్ హాలిడేకు వెళ్లడానికి సమాయత్తమవుతున్న తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతానికి చెందిన మండలాల జాబితాలో తాజాగా మరో మండలం చేరింది. ఇప్పటికే ముమ్మిడివరం, అల్లవరం మండలాల్లో రైతులు ఈ దిశగా ముందుకువెళ్తుండగా మంగళవారం అయినవిల్లి మండల రైతులు కూడా జతకలిశారు. మంగళవారం మండలంలోని మాగాం గ్రామంలో జరిగిన సమావేశంలో క్రాప్ హాలిడే ప్రకటించాలని రైతులు నిర్ణయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మండలస్థాయి అధికార్లు క్రాప్ హాలిడే నిర్ణయాన్ని విరమించుకోవాలని రైతులను బుజ్జగించే పనిలో పడ్డారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని మాగాం గ్రామంలో మంగళవారం రైతులంతా సమావేశమై అధికారులు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే క్రాప్ హాలీడే ప్రకటించాలని నిర్ణయించారు.
కాలువలకు సాగునీరు ఏప్రిల్ 22వ తేదీన నిలుపుదల చేశారని, జూన్ 21వ తేదీ వచ్చినా నీరందించకపోతే సాగు ఎలా చేయగలమని సమావేశంలో రైతులు ఆందోళన వ్యక్తంచేశారు.నీరు లేక ఇప్పటివరకూ నారుమళ్ళు వేయలేదని, ఇప్పుడు నారుమళ్ళు వేస్తే, ఎప్పటికి నాట్లు వేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. క్రాప్ హాలీడే ప్రకటిస్తే మండలంలో 3,649 హెక్టార్లపై ప్రభావం పడనుంది. కాగా విషయం తెలుసుకున్న అయినవిల్లి మండల అభివృద్ధి అధికారి లక్ష్మయ్యబాబు, తహసీల్దార్ సుస్వాగతం, ఇరిగేషన్ ఎఇ సునీత, అగ్రికల్చరల్ ఎఒ కుమార్‌బాబు మాగాం చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. ఇరిగేషన్ ఎఇ సునీత మాట్లాడుతూ కాలువల మరమ్మతు పనుల్లో జాప్యం కారణంగా నీరు విడుదల ఆలస్యమయ్యిందని, మూడు రోజుల్లో రైతులకు సాగునీరందిస్తామన్నారు. ఈసందర్భంగా రైతులు అధికార్ల దృష్టికి కొన్ని డిమాండ్లు తీసుకొచ్చారు. ధాన్యానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ.400 బోనస్ ఇవ్వాలని, ఏటా మే 15వ తేదీకి సాగునీరు అందించాలని, దాళ్వా, సార్వా వరి సాగుకు 10 రోజులు ముందుగా ఉపాధి హామీ పనులు నిలుపుచేయాలని, 2015-16 సంవత్సరానికి సంబంధించి రైతులకు పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రైతులు డిమాండుచేశారు.

చిత్రం క్రాప్ హాలీడేపై చర్చించుకుంటున్న రైతులు