ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో కరవు మండలాలు 80

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: ఈశాన్య రుతుపవనాల సమయంలో రబీపై వర్షాభావ ప్రభావం పడిన నేపథ్యంలో 80 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. తీవ్ర కరవు నెలకొన్న మండలాలుగా 54, ఒక మోస్తరు కరవు 26 మండలాల్లో ఉన్నట్లు ప్రకటించింది. కరవు మండలాల ప్రకటనకు సంబంధించి వివిధ మార్గదర్శకాలను అనుసరించి వీటిని గుర్తించింది. తీవ్ర కరవుకు సంబంధించి ప్రకాశం జిల్లాలో అద్దంకి, అర్ధవీడు, బెస్తవారిపేట, చంద్రశేఖరపురం, చీమకుర్తి, కంభం, దర్శి, దొనకొండ, దోర్నాల, గిద్దలూరు, గుడ్లూరు, హనుమంతునిపాడు, కనిగిరి, కోమరవోలు, కొనకనమిట్ల, కోరిసిపాడు, కురిచేడు, లింగసముద్రం, మార్కాపురం, మర్రిపూడి, ముండ్లమూరు, పామూరు, పెదరావీడు, పెదచెర్లోపల్లి, పొదిలి, పొన్నలూరు, రాచర్ల, సంతనూతనపాడు, సింగరాయకొండ, తాళ్లూరు, తర్లుపాడు, త్రిపురాంతకం, వెలిగొండ్ల, వోలేటివారిపాలెం, నెల్లూరు జిల్లాలో సీతారాంపురం, వరికుంటపాడు, కొండాపురం, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, చేజెర్ల, అనంతసాగరం, రాపూరు, పొదలకూరు, గూడూరు, సైదాపురం, బాలయ్యపల్లి, ఓజిలి, కోట, కడప జిల్లాలో కలసపాడు, పోరుమామిళ్ల, పెండ్లిమర్రి, శ్రీ అవధూత కాశినాయన, విజయనగరం జిల్లాలో కొత్త వలస ఉన్నాయి. ఒక మోస్తరు కరవు మండలాలుగా ప్రకాశం జిల్లాలో బల్లికురవ, మార్టూరు, సంతమాగులూరు, కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠం, బి.కోడూరు, బద్వేల్, గోపవరం, రామాపురం, రాజంపేట, నందలూరు, పెనగలూరు, అనంతపురం జిల్లాలో రాయదుర్గ, గుమ్మగట్ట, బ్రహ్మసముద్రం, కుందుర్తి, కంబదూరు, చెనే్న కొత్తపల్లి, ధర్మవరం, తలుపుల, ఆమడుగూరు, ఓబులదేవరాచెరువు, గోరంట్ల, పుట్టపర్తి, బుక్కసముద్రం, కొత్త చెరువు, పెనుగొండ ఉన్నాయి.