ఆంధ్రప్రదేశ్‌

ఒంటిమిట్ట మృతుల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 19: కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో దొరికిన ఐదు మృతదేహాలు తమిళులవేనని డీఐజీ ఘట్టమనేని శ్రీనివాసులు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యిందని, వారి బంధువులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు మృతులను తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కరమందురై గ్రామానికి చెందిన మురుగేషన్ (42), జయరాజ్(25), మురుగేషన్(42), కరుప్పణన్(23), చిన్నప్పయన్(45)గా గుర్తించామన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఒంటిమిట్ట చెరువులో ఐదు మృతదేహాలు ఉన్నట్లు గ్రామస్తులు పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారని తెలిపారు. వెంటనే సీఐ రవికుమార్ సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారన్నారు. అగ్నిమాపకశాఖ సిబ్బంది సహకారంతో మూడు గంటల పాటు శ్రమించి ఐదు మృతదేహాలను వెలికితీశామన్నారు. ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించామన్నారు.