ఆంధ్రప్రదేశ్‌

వేసవిలో అధిక వేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: ఉపాధి హామీ పథకం కూలీలకు వేసవిలో వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌లో 30 శాతం అధికంగా వేతనాలు చెల్లించాలని చెప్పారు. సంఘటితంగా పనిచేసే మహిళా బృందాలకు అధికంగా వేతనాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కూలీలకు వేతనాల చెల్లింపు ఆలస్యం కాకుండా, తక్షణమే చెల్లించేలా ప్రస్తుత విధానాన్ని మెరుగుపరచాలని నిర్దేశించారు. సోమవారం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ - ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ కౌన్సిల్ సమావేశాన్ని ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్‌లో ముఖ్యమంత్రి నిర్వహించారు. 2017-18 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రూ.6వేల కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ పథకం ద్వారా 2016-17లో రూ.5,200 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి నిధులు పొందగలిగామని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం నిధులు విస్తృతంగా వినియోగించడం ద్వారా రాష్ట్రానికి పెద్దఎత్తున ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఉపాధి హామీ కింద 2017-18లో రాష్ట్రంలో మొత్తం 18.40 కోట్ల పనిదినాలు కల్పించామని, ఇందులో మహిళలకు 10.45 కోట్ల పనిదినాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. కూలీలకు వేతనాల రూపంలో మొత్తం రూ. 2,613.45 కోట్లు చెల్లించామని చెప్పారు. ఈ ఏడాది మార్చి 31లోపు 5.46 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. కూలీలకు పనిదినాల కల్పనలో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో, కృష్ణా జిల్లా చివరి స్థానంలో ఉన్నాయన్నారు. ఉపాధి హామీ పథకం కింద 2017-18లో పంటకుంటలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటులో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచినట్టు అధికారులు వివరించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడంతోనే సరిపెట్టకుండా వాటిని వినియోగించుకునేలా చైతన్యం తేవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. పంచాయతీరాజ్ శాఖపై జరిగిన సమీక్షలో రాష్ట్రంలోని మొత్తం 12,918 గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు 4,287 పంచాయతీల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేశామని, వీటిలో 841 పంచాయతీలకు ఫైబర్ నెట్ కనెక్షన్ అందించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పల్లెల్లో సౌకర్యాలపై సమగ్ర సమాచారం సేకరించాలని సీఎం ఆదేశించారు. అన్ని పంచాయతీలకు వైఫై సౌకర్యం కల్పించేలా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.