ఆంధ్రప్రదేశ్‌

డీలర్లు సమయపాలన పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 22: రాష్ట్రంలోని చౌకధరల దుకాణ డీలర్లు ప్రభుత్వం నిర్ధేశించిన పనివేళల్లో ప్రజలు అందుబాటులో ఉండాలని, సమయ పాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. గురవారం గుంటూరు కలెక్టరేట్‌నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి పుల్లారావు రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన జాయింట్ కలెక్టర్‌లు, ఆయా జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు, మేనేజర్లతో సౌరసరఫరాల శాఖ ద్వారా అమలు జరుగుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు చౌకధరల దుకాణాలు పనిచేయాలన్నారు. అలా పనిచేయని డీలర్లపై చర్యలు తీసుకునేలా జిల్లాలోని సంయుక్త కలెక్టర్‌లు, ఆర్డీవోలు, డిఎస్‌ఒలు ప్రత్యేక దృష్టి సారిస్తే డీలర్లు సక్రమంగా పనిచేస్తారన్నారు. కొన్ని నిత్యావసర వస్తువులపై మార్కెట్ ధరల కంటే తక్కువగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం చంద్రన్న విలేజ్‌మాల్స్ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి రాష్టవ్య్రాప్తంగా 1500, జూన్ నాటికి 6,500 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా పిడిఎస్ రైస్ రీసైక్లింగ్ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఈపాస్ విధానం ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు రేషన్‌డీలర్లు ఎక్కడా అవకతవకలకు పాల్పకుండా ప్రజలకు సక్రమంగా రేషన్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఎ,బి రిజిష్టర్ సక్రమంగా నిర్వహించేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని సంయుక్త కలెక్టర్‌లు, ఆర్డీవోలు, డిఎస్‌ఒలు, మేనేజర్లు ఆకస్మిక తనిఖీలు చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠంగా అమలయ్యేలా కృషి చేయాలని మంత్రి పుల్లారావు సూచించారు. సోషల్ ఆడిట్ ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి రాజశేఖర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి రామగోపాల్, పౌరసరఫరాల శాఖ సంచాలకులు రవిబాబు తదితరులు పాల్గొని జిల్లాలో అమలు జరుగుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరుపై అధికారులతో క్షుణ్ణంగా సమీక్షించారు.