ఆంధ్రప్రదేశ్‌

రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: రక్షణ, ఎయిరో స్పేస్ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం పెరగాలని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య సదస్సు రెండో రోజు ఆదివారం ఎయిరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగంపై జరిగిన సెషన్‌లో విశ్రాంత ఎయిర్ మార్షల్ అశ్విన్ కే నాబ్ మాట్లాడుతూ ఈ రంగంలో స్వదేశీ పరిజ్ఞానం పెరిగితే ఆర్థికంగా కూడా దేశానికి లాభిస్తుందన్నారు. గతంలో రక్షణ, ఎయిరో స్పేస్ రంగంలో కార్యకలాపాలు ప్రభుత్వ రంగం సంస్థలు మాత్రమే సాగించేవని, ప్రస్తుతం ప్రైవేటు సంస్థలు సైతం ప్రాజెక్టులు రూపొందిస్తున్నాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న తరుణంలో కేంద్రం కూడా సానుకూల ధృక్పథానే్న అనుసరిస్తోందన్నారు. తాజాగా కేంద్రం 2016 నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ పాలసీని రూపొందించిందని, దీనివల్ల ఎయిరోస్పేస్ రంగం అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఇక అంతరిక్ష విభాగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాల్సి ఉందన్నారు. కమ్యూనికేషన్స్ తదితర రంగాల్లో దేశం మరింత గణనీయమైన ప్రగతి సాధించాలంటే ప్రైవేటు ప్రోత్సాహం అవసరమన్నారు. వెంకటరరాజు మాట్లాడుతూ ఎయిరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగాన్ని తీసుకుంటే మూడు రకాలుగా చెప్పుకోవచ్చన్నారు. 90వ దశకానికి ముందు ఎయిరోస్పేస్, రక్షణ రంగాల్లో అన్ని అవసరాలకు ఇతర దేశాలపై ఆధారపడి మనుగడ సాగించే పరిస్థితులు ఉండేవన్నారు. తరువాత కాలంలో కొంతమేర విదేశాలపై ఆధారపడి నప్పటికీ స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోగలిగామన్నారు. ఈ కాలంలోనే స్వదేశీ పరిజ్ఞానంతో పలు విజయాలు సాధించామని గుర్తు చేశారు.
ముఖ్యంగా ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో ప్రాజెక్టులు చేపడుతున్నారని, మేకిన్ ఇండియా దీనికి దోహదం చేస్తోందన్నారు. అరుణాకర్ మిశ్రా మాట్లాడుతూ రక్షణ రంగ ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితులు మారుతున్నాయన్నారు. ప్రస్తుతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే రక్షణ రంగ అవసరాలు తీర్చుకో గలుగుతున్నామన్నారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధి అంబర్ దూబే సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేకిన్ ఇండియా నినాదంతో దేశీయంగా ఉత్పత్తులు పెరగడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. కమెడోర్ అజయ్ శర్మ, అనిల్ గుప్త తదితరులు పాల్గొన్నారు.