ఆంధ్రప్రదేశ్‌

మీ కీచులాటలతో మమ్మల్ని ముంచొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: కృష్ణానది ఎగువనున్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతుంటే దాన్ని అరికట్టకుండా తెలుగు రాష్ట్రాలు కీచులాడుకుంటూ రైతాంగాన్ని అధోగతిపాలు చేస్తున్నారంటూ రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్, ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో బిజెపికి ఎంతో కొంత బలం ఉందనే మితిమీరిన విశ్వాసంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికే కొమ్ము కాస్తున్నట్లు కన్పిస్తోందని, మిత్రపక్షం కదాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంటే భావితరాలు క్షమించబోవంటూ వారు హెచ్చరించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ సిఫార్స్‌లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గెజిట్ ప్రచురణ జరగనందున బచావత్ ట్రిబ్యునల్ సిఫార్స్‌లో అమల్లో ఉండేలా చూడాల్సి ఉందన్నారు. వెనుకా ముందూ ఆలోచించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం కృష్ణానదిలో 299 టిఎంసిల నీటిని తెలంగాణ వినియోగించుకోటానికి అనుమతి తెలపటం సరైందికాదన్నారు. ఈ గడువు ఈ నెల 18తో ముగిసినప్పటికీ దీన్ని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం వాదించడం దారుణమన్నారు. వాస్తవానికి బచావత్ ట్రిబ్యునల్ నాగార్జునసాగర్ నుంచి 106 టిఎంసిలు, జూరాల నుంచి 18టిఎంసిలు వెరశి మొత్తం 124 టిఎంసిల నీటిని మాత్రమే వినియోగించుకునే హక్కు ఉందన్నారు. రివర్‌బోర్డు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా ఎగువ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన నీరు వచ్చినట్లుగా వినియోగించుకుంటే అత్యంత తక్కువ నీరు చేరి ఎక్కువ నష్టపోయేది సాగర్ ఆయకట్టు మాత్రమేనన్నారు. ఇక సాగర్ పొంగి పొర్లితేనే పులిచింతలకు పూర్తిస్థాయిలో నీరు చేరుతుందని అయితే దీని పరివాహక ప్రాంతంలో వర్షపాతం తక్కువేనన్నారు. 20 ఏళ్లు గడుస్తున్నా డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తి కాకపోగా ఈ పనుల వలన గతంలో కంటే నీటి వినియోగం పెరిగిందన్నారు. ఇక శ్రీశైలం, సాగర్‌లలో 190 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యాన్ని పూడిక వలన కోల్పోవటం వలన మిగులు జలాలను నిలువ చేసుకునే అవకాశం లేకుండా పోతుందన్నారు. డెల్టాకు ఓ విచిత్రమైన సమస్య ఎదురు కాబోతోంది. సాగర్‌తో ఉన్న బంధం తెగిపోయి డీలింక్ కాబోతోందని యెర్నేని నాగేంద్రనాధ్ అన్నారు. గోదావరి నుంచి 80 టిఎంసిల నీరు ప్రకాశం బ్యారేజికి చేరగానే సాగర్ నుంచి దిగువకు నీటి విడుదల నిలచిపోగలదంటూ హెచ్చరించారు.