ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడకు జెఎసి బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 23: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు నేతలను ఒక తాటిపైకి తీసుకురావడానికి కాపు జెఎసి సన్నాహాలు ప్రారంభించింది. పార్టీలకు అతీతంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను ఒక వేదికపైకి తీసుకురావాలని జెఎసి నేతలు యోచిస్తున్నారు. ముద్రగడ దంపతుల నిరాహార దీక్ష అనంతరం రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన ముఖ్య నేతలను సంఘటితం చేసి, ఇకపై ముద్రగడ ఆధ్వర్యంలో జరిగే ఏ పోరాటానికైనా వారందర్నీ కార్యోన్ముఖులను చేయడమే లక్ష్యంగా పనిచేయాలని జెఎసి నిర్ణయించినట్టు కాపు సద్భావన సంఘం తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి చెప్పారు. ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో ఇతర కులాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాల్లో కాపు నేతలున్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన పక్షంలో తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని బిసి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కూడా కాపు జెఎసి నేతలు వ్యూహాత్మకంగా సాగాలని నిర్ణయించారు. బిసిలకు అన్యాయం జరగకుండా, తమకు రిజర్వేషన్లు కల్పించాలన్నది తమ డిమాండ్‌గా గ్రామస్థాయిలో ప్రచారం చేయాలని కాపు జెఎసి నిర్ణయించింది. తమను అవమానించిన వారిని ఆ భగవంతుడు తగిన విధంగా శిక్షిస్తాడని, ఆ వార్త తెలిసే వరకు తన ఇంట్లో ఏ విధమైన పండుగలు జరుపుకోమంటూ ముద్రగడ చేసిన సంచలన వ్యాఖ్యలను ఇప్పుడు కాపు జెఎసి సెంటిమెంట్‌గా భావిస్తోంది. తమ నేత పండుగలను బహిష్కరిస్తే తాము కూడా అందుకు సిద్ధమేనని నేతలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. ముద్రగడ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన కాపు మంత్రులు జాతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ కాపు జెఎసి నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యమంలో కలసిరాని మంత్రులకు కాపు కులం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరిస్తున్నారు.