ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ప్రజలను దగా చేసిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, మార్చి 18: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర ఫ్రజానీకాన్ని దగా చేశారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో విలేఖర్లతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో విశాఖ, తిరుపతిల్లో జరిగిన సభల్లో ఎపీనీ సొంత రాష్ట్రంగా తీసుకుంటానని ఇచ్చిన హామీ నాలుగేళ్ళు గడుస్తున్నా ఫలితం కనిపించలేదన్నారు. విభజన చట్టంలో ఉన్నవన్నీ అమలు చేస్తామని, పోలవరం బాధ్యత మాదేనని హామీ ఇచ్చారన్నారు. నాలుగేళ్ళ నిరీక్షణతో సహనం కోల్పోయి కేంద్రం నుండి టీడీపీ మంత్రులను రాజీనామా చేయించామని అయ్యన్న తెలిపారు. అయినప్పటికీ మిత్రులుగానే కొనసాగుతామని తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించినా టీడీపీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ నష్టాన్ని కలిగించేలా ప్రవర్తించారన్నారు. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ మిత్రధర్మం సైతం మరిచిపోయారని, జనసేన అవిర్భావ సభలో అధినేత పవన్ కళ్యాణ్ ఆపార్టీ ప్రణాళికను వివరించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను తిట్టడమే ఎజెండా పెట్టుకుని మాట్లాడారన్నారు. పవన్‌కు రాజకీయ అవగాహన లేదని, నిన్నమొన్నటి వరకు ముఖ్యమంత్రిని పొగిడిన వ్యక్తి హఠాత్తుగా విమర్శించడం వెనుక ఏ శక్తులు ఉన్నాయో ఎవరికైనా అర్థం అవుతుందన్నారు. ముందు మోదీని విమర్శించిన పవన్ తాజాగా ఒక్క మాట కూడా అనకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం ప్రకటన చేసిన వెంటనే దేశంలోని 11 రాజకీయ పార్టీలు మద్దతునిచ్చాయని ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. చంద్రబాబు సమర్థతకు ఇదే నిదర్శనమన్నారు. సోమవారం పార్లమెంట్‌లో టీడీపీఅవిశ్వాస తీర్మానానికి ఎంపీలంతా మద్దతునివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.