ఆంధ్రప్రదేశ్‌

బీజేపీతో జగన్ మిలాఖత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 18: అనుక్షణం నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షిస్తూ అందుకు కృషి చేస్తున్న చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నంలో పదవీ కాంక్షతో వైఎస్ జగన్ బీజేపీతో చేతులు కలిపారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. శాంతియుతంగా అభివృద్ధిలో ముందుగు దూసుకుపోతున్న ఏపీని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, చంద్రబాబు ముందు ఎవరి ఎత్తులూ సాగవని స్పష్టం చేశారు. నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో ఆదివారం ఆయన విలేఖరులతో మా ట్లాడుతూ పవన్, జగన్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చం ద్రబాబును రాష్ట్రంలో బలహీనపరిచేందుకు జగన్ బీజేపీతో చేతులు కలి పి సరికొత్త నాటకాలకు తెరతీశారన్నా రు. బాబుని ఎదుర్కొనే ధైర్యం, శక్తి లేకనే 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కులను మోదీ, పవన్ వద్ద జగన్ తాకట్టు పెట్టారని విమర్శించారు. బాబుని రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు జగన్, పవన్, బీజేపీ నాయకులని ధ్వజమెత్తారు. గురువు అద్వానీకే పంగనామాలు పెట్టిన చరిత్ర ఉన్న నేత మోదీ అని ఆరోపించారు. కాంగ్రె స్ పార్టీ పాలనలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ బొత్స సత్యనారాయణ అనే విషయం రాష్ట్రంలోని అందరికీ తెలుసన్నారు. అలాంటి వ్యక్తికి బాబుని, లోకేష్‌ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో వందల కోట్ల రూపాయల విలువైన భూములు దోచుకున్న భూమన కరుణాకర్ రెడ్డి సీబీఐని ఊరకుక్కలతో పోల్చడం సరికాదన్నారు. దేశంలోనే అత్యున్నత సంస్థ సీబీఐని ఊరకుక్కలతో పోల్చిన ఆయన తక్షణం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం పై చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన గంటలో పది పార్టీలు మద్ద తు పలికాయంటే బాబు సత్తా ఏమి టో అర్థవౌతుందన్నారు. కేంద్రంపై అవిశ్వాసం ప్రకటిస్తే అందరి మద్దతు కూడగడతానని ప్రకటించిన పవన్‌కళ్యాణ్ బాబును విమర్శించడం అర్థరహితమన్నారు. పవన్‌కళ్యాణ్‌కు సత్తా ఉంటే ఏపీలో ఉన్న ఇద్దరు బీజేపీ ఎంపీలతో అవిశ్వాసానికి మద్దతు కూడగట్టాలన్నారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయని, బీజేపీకి పతనం ప్రారంభమైందని ధ్వజమెత్తారు.