ఆంధ్రప్రదేశ్‌

వేసవిలో తాగునీటి వసతికి ప్రత్యేక ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 18: వేసవిలో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఆదివారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటించి పరిస్థితులను అంచనా వేయాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నీటి సరఫరా ట్యాంకర్లను పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆయన ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న నీటి ఎద్దడి దృష్ట్యా అదనపు సిబ్బందిని నియమించి ప్రతిరోజూ రియల్‌టైంలో నీటి సమస్యలను పరిష్కరించాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ప్రకాశం జిల్లాకు అదనంగా గ్రామీణ నీటి సరఫరా అధికారులను నియమించాలన్నారు. ఒంగోలు డీఈఈ యోగేష్‌బాబు, నెల్లూరు డీఈఈ మతీన్, గుంటూరు డీఈఈ దుర్గాప్రసాద్‌లకు ప్రకాశం జిల్లా సమ్మర్ యాక్షన్ ప్లాన్ బాధ్యతలను ఆయన అప్పగించారు. ప్రతిరోజూ పరిస్థితులను అంచనా వేయాలని, గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన పరిస్థితుల్లో ఆయాచోట్లకు అదనపు నీటి ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేయాలన్నారు. అధునాతన టెక్నాలజీ ద్వారా రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా ట్యాంకర్లను పర్యవేక్షించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలని తెలిపారు. జలవాణి కాల్‌సెంటర్‌తో పాటు ప్రజల నుండి స్వయంగా వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి తక్షణం పరిష్కరించాలన్నారు. మిగతా జిల్లాల్లో తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై కూడా దృష్టిపెట్టాలని, ప్రతిరోజూ సమస్యల వారీగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో తాగునీటి సమస్యలున్నా జలవాణి కాల్‌సెంటర్ నెంబర్ 1800 425 1899కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు వచ్చిన వెంటనే సమస్యను పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్య దృష్ట్యా సాధికార మిత్రలకు జలవాణి కాల్ సెంటర్‌పై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి 35 కుటుంబాలకు ఉన్న సాధికార మిత్రల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని తెలిపారు. సమస్య పరిష్కారమైన తరువాత ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో పశువులకూ తాగునీటి సమస్య లేకుండా నీటిని అందుబాటులో ఉంచాలని కూడా మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.