ఆంధ్రప్రదేశ్‌

మోదీకి జగన్, పవన్ కోవర్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: ప్రధాని మోదీకి జగన్, పవన్ కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవిశ్వాసానికి టీడీపీ మద్దతిస్తుంటే దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం రాసిచ్చిన స్క్రిప్టును పవన్‌కళ్యాణ్ చదివాడని విమర్శించారు. మొన్నటి మాటలకు, నేటి మాటలకు స్పష్టంగా తేడా కన్పిస్తోందని, మోదీ ప్రత్యేక హోదా హామీ ఇవ్వలేదన్న పవన్ వ్యాఖ్యలు వింటుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. మోదీకి వ్యతిరేకంగా పవన్ ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. పోలవరం నిర్మాణం జరక్కూడదన్నదే ఆయన అభిప్రాయంగా కన్పిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలకు పవన్ మార్కులేస్తున్నారని, ఆ మార్కులు ఎవరిక్కావాలని ప్రశ్నించారు. మోదీ-చంద్రబాబు మధ్య పాతకక్షలు ఏముంటాయని ప్రశ్నించారు. గోద్రా ఘటన సమయంలో రాజీనామా చేయాలని మోదీని చంద్రబాబు డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అప్పటి జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డిమాండ్ చేశారేతప్ప తన సొంత వ్యవహారం కోసం రాజీనామా చేయమన్నారా? అంటూ ప్రశ్నించారు. ఏపీలో పాగా వేయడానికి పవన్‌కళ్యాణ్ వెనుక బీజేపీ ఉండి ఆడిస్తోందన్నారు. ఏపీలో బీజేపీ పరిస్థితి కుక్కతోక బెత్తెడే అన్నట్టుందని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో టీడీపీ పోరాడుతుంటే పవన్ రోజుకో ప్రకటన చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆరోపించారు. ఎన్డీఏ భాగస్వామినని చెప్పుకుంటున్న ఆయనకు బీజేపీ మేనిఫెస్టోలో ఏముందో తెలియదా అంటూ ప్రశ్నించారు. కేంద్రమే పవన్‌తో నాటకమాడిస్తోందని ఆరోపించారు. తనవల్లే గెలిచారని, తాను ప్రచారం చేయటం వల్లే గెలిచారంటూ పవన్ వ్యాఖ్యానించడం సరికాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఢిల్లీ స్క్రిప్టుకు అనుగుణంగా పవన్ కామెంట్లు చేస్తున్నారన్నారు. పోలవరంలో ఇన్నాళ్లు కనిపించని అవినీతి ఇప్పుడే కనిపించిందా? అంటూ, ఇలానే విమర్శలు చేస్తే పవన్, జగన్ చరిత్ర హీనులవుతారంటూ ఆయన హెచ్చరించారు.