ఆంధ్రప్రదేశ్‌

పోలవరం ప్రాజెక్టు ప్రతిష్ఠాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం మీదనే ఉందని, ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న పొరపాటుకూ తావులేకుండా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన పోలవరం, ప్రాధాన్యతా ప్రాజెక్టులపై 54వ వర్చువల్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఒక్క పోలవరం ప్రాజెక్టుకే రూ. 9వేల కోట్లు కేటాయించామని, ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయంలోనే పూర్తిచేసి తీరతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం నియమించిన కమిటీ గత శుక్రవారం సందర్శించి పనులపై సంతృప్తి వ్యక్తం చేసిందని, డీపీఆర్‌లో మిగిలిన నిధులు ఒకటి రెండురోజుల్లో విడుదల కావచ్చని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదిలావుంటే గత వారం 5.53 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను 4.01 లక్షల క్యూ.మీ మేర మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. నెలకు లక్ష క్యూ.మీ కాంక్రీటు పనుల పూర్తి లక్ష్యం కాగా, 21,283 క్యూ.మీ. కాంక్రీట్ పనులను పూర్తిచేశారు. 20 మీ. డయాఫ్రం వాల్ పనులకు గాను 19.2 మీటర్ల పనులు పూర్తయ్యాయి. పోలవరం పునరావాసానికి సంబంధించి అన్ని పనులను ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తిచేసి తీరాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. చీఫ్ ఇంజనీర్ డిజైన్లను అత్యధిక ప్రాధాన్యంతో పూర్తిచేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు సైట్‌లో ఉన్న 25 కెమెరాలను ఏపీ ఫైబర్ గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని ఆర్టీజీ సీఈఓ అహ్మద్ బాబును ఆదేశించారు. రాష్ట్రంలోని 29 ప్రాధాన్యతా ప్రాజెక్టులకు సంబంధించి జరుగుతున్న 52 పనులపై సవివరంగా సమీక్షించారు. నిర్దేశించిన కాలపరిమితిలోగానే ప్రాజెక్టులను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల వౌలిక సదుపాయాలకు, పునరావాసానికి 4,500 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశామన్నారు. వంశధార-నాగావళి నదుల అనుసంధానం, పులిచింతల ప్రాజెక్టు, కొండవీటి వాగు పంపింగ్ స్కీమ్, కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు, యర్రం చిన్న పోలిరెడ్డి కొరిశపాడు లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఫేజ్-2 కింద అడవిపల్లి రిజర్వాయర్, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజి, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఫేజ్-2 కింద కుప్పం బ్రాంచ్ కెనాల్, (ఎన్‌హెచ్-31 రోడ్ వర్క్), గండికోట రిజర్వాయర్, మరల రిజర్వాయర్ (ప్యాకేజీ నెం.12), చెర్లోపల్లి రిజర్వాయర్ (ప్యాకేజీ నెం.25), మడకశిర బ్రాంచి కెనాల్ (బియాండ్ గొల్లపల్లి రిజర్వాయర్), పులకుర్తి లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్, బీఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు రెండో దశలో ఫేజ్-2 (హిరమండలం రిజర్వాయర్)లకు ముఖ్యమంత్రి త్వరలో ప్రారంభోత్సవం చేయనున్నారు. నాగావళి-వంశధార అనుసంధానంపై శ్రీకాకుళం కలెక్టర్ ధనంజయరెడ్డితో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ శాఖాపరమైన ఇబ్బందులు రాకుండా చూస్తానన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేయకపోతే పూర్తయ్యేదాకా అక్కడే నిద్రిస్తానన్నారు. ఎక్కడైతే మిగిలిందో అక్కడ భూసేకరణకు వారం గడువు ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

చిత్రం..రాష్ట్రంలో ప్రాజెక్టులపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు