ఆంధ్రప్రదేశ్‌

టెట్‌లో 43 శాతం ఉత్తీర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్): రెండువేల పదమూడులో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల్లో 35శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధిస్తే 2017లో 43శాతం మంది ఉత్తీర్ణులై డీఎస్సీకి అర్హత సాధించారని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం నగరంలోని ఓ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్) ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరి 2 నుండి మార్చి 2 వరకు తొలిసారిగా ప్రవేశపెట్టిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్‌లైన్ పరీక్షకు 4,46,833 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,14,120 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 190 సెంటర్లలో జరిగిన పరీక్షకు మూడు పేపర్లు కలిపి 4,36,829 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. పేపర్-1కు 1,80,742 మంది దరఖాస్తు చేసుకోగా 1,73,861 మంది పరీక్షకు హాజరయ్యారు. 96.19 శాతం మందికి గాను 57.88 శాతం మంది అర్హత సాధించారు. పేపర్-2లో 2,04,028 మంది దరఖాస్తు చేసుకోగా 1,81,734 మంది పరీక్షకు హాజరయ్యారు. 89.07 శాతానికి గాను 38.22 శాతం మంది అర్హత సాధించారు. పేపర్-3లో 62,063 మంది దరఖాస్తు చేసుకోగా 58,525 మంది పరీక్షకు హాజరయ్యారు. 94.29 శాతానికి గాను 42.60 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్ కీని మార్చి 4న విడుదల చేసి 9 వరకు అభ్యంతరాలు స్వీకరించామన్నారు. ఈ పరీక్షలో 25శాతం మంది అభ్యర్థులకు 90 శాతానికి పైగా మార్కులు వచ్చాయన్నారు. పేపర్-1లో 5 యాడ్ స్కోర్ మార్కులు, పేపర్-2లో 11 మార్కులు కలిపినట్లు తెలిపారు. జనరల్ అభ్యర్థులకు 60శాతం, బీసీలకు 50శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40శాతం మార్కులు అర్హత మార్కులుగా ఉన్నాయన్నారు. 84మంది పరీక్ష ఫలితాలు ప్రకటించలేదని, అభ్యర్థులు చేసిన తప్పుల వల్ల ఆలస్యం జరిగిందన్నారు. టెట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎ సంధ్యారాణి, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎ సుబ్బారెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్
ఈనెలాఖరు కల్లా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆర్థిక శాఖకు ఫైల్ పంపామని, అనుమతి లభించగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.