ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 21: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజానీకానికి ఇప్పటి వరకు అనేక కష్టాలు వచ్చాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 60 సంవత్సరాలు కష్టపడి అభివృద్ధి చేసిన తరువాత కట్టుబట్టలతో హైదరాబాద్ విడిచి అమరావతికి రావాల్సి వచ్చిందన్నారు. తన మనవడు దేవాన్ష్ 4వ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలసి కలిసి బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రభుత్వాన్ని భర్త్ఫ్ చేసిందన్నారు. ప్రజలు, వెంకటేశ్వరస్వామి సహకారంతో ఆయన తిరిగి అధికారంలోకి వచ్చారన్నారు. అటు తరువాత ఎన్నికలు పెట్టినా తిరుగులేని విజయాన్ని ఎన్‌టిఆర్ సాధించారన్నారు. 2014కు ముందు రాష్ట్ర విభజన విధానం దారుణమని అప్పుడు ప్రజలెంతో బాధపడ్డారన్నారు. అయితే విభజన సమయంలో పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చట్టం చేసిన హామీలను కేంద్రం నేడు అమలు చేయడంలేదన్నారు. దీంతో పోరాటం చేయక తప్పలేదన్నారు. ఈక్రమంలోనే రాజీలేని పోరాటం సాగిస్తున్నామని ఇందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని చెప్పారు. ఇతర పార్టీల సహకారం తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలనే ముందుకు పోతున్నామని, పోరాటం చేస్తున్నామని అన్నారు. ఓవైపు అభివృద్ధి చేపడుతూనే రాష్ట్రానికి చెందిన హక్కులను సాధించేందుకు పోరాటం చేయడానికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోరానన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేలా ఆశీర్వదించమని కోరానన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమాలపై విలేఖరులు అనేక ప్రశ్నలు వేసినా చంద్రబాబు దాటవేశారు. విలేఖరుల సమావేశంలో మంత్రి నారాలోకేష్ కూడా పాల్గొన్నారు. ఇలా ఉండగా దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమల అన్నప్రసాద వితరణలో భక్తులకు ఒక్కరోజుకు అయ్యే వ్యయాన్ని రూ.26లక్షలని అధికారుల నుంచి తెలుసుకుని ఆన్‌లైన్లో నగదును చెల్లించారు. కాగా విరాళాలు ఇచ్చే దాతలకు ప్రసాదాలను, అందుకు సంబంధించిన రశీదులను టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ దాత దేవాన్ష్‌కు సీఎం సమక్షంలో అందించారు.