ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా జిల్లా రిజిస్ట్రార్‌కు రూ.10వేలు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 25: సమాచార హక్కు చట్టం కమిషనర్ ముందు సకాలంలో హాజరుకానందుకు, ఫిర్యాదుదారు కోరిన సమాచారం ఇవ్వనందుకు జిల్లా రిజిస్ట్రార్ బి శివరామ్‌కు రూ.10వేలు జరిమానా విధిస్తూ శనివారం సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. ఎస్ ఇంతియాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణానికి చెందిన స.హ చట్టం కార్యకర్త, యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్‌టిఐ క్యాంపెయిన్ జిల్లా కో-ఆర్డినేటర్ బేతపూడి మనోహర్ ఫిబ్రవరి 15న చిట్‌ఫండ్ కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా కోరాడు. అయితే సంబంధిత సమాచారాన్ని ఇవ్వకుండా రిజిస్ట్రార్ కాలయాపన చేశారు. దీంతో స.హ చట్టం కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా ఈ నెల 16న కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. దీన్ని బేఖాతరు చేసిన రిజిస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌ను పంపటంతో ఆగ్రహించి జరిమానా విధించారు.