ఆంధ్రప్రదేశ్‌

కమలంలో అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: : చప్పగా రూపొందించిన రాజకీయ తీర్మానం.. తెదేపాతో పార్టీ వైఖరి ఎలా ఉండాలో తేలని అస్పష్టత.. ఎండోమెంట్ భూముల లీజులపై మంత్రితో నేతల వాగ్వాదం..రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పాగా.. మీడియాలో లీకు కథనాలపై అధ్యక్షుడి ఆగ్రహంతో రెండు రోజుల బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. భీమవరంలో రెండురోజుల నుంచి జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయకుండా ముగియడంపై శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెదేపాతో వైఖరి ఎలా ఉండాలన్న దానిపై నాయకత్వం స్పష్టత ఇవ్వాలని పదాధికారులు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా, నాయకత్వం నుంచి స్పష్టత కనిపించకపోగా, మంత్రులు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ క్రమశిక్షణ తప్పుతున్నారంటూ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు వ్యాఖ్యానించడంపై నిరసన వ్యక్తమయింది.
పార్టీ భవిష్యత్తును నిర్దేశించే రాజకీయ తీర్మానం కూడా చప్పగా రూపొందించారని, భవిష్యత్తులో పార్టీ వైఖరి, తెదేపా నాయకత్వంతో జరుగుతున్న ఘర్షణకు పరిష్కార మార్గాలతోపాటు, పార్టీ వ్యూహం, పొత్తుతో పనిలేకుండా పార్టీ ఎదుగుదల వంటి కీలక తీర్మానాలేమీ రూపొందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎండోమెంటు భూముల లీజులపై మంత్రి మాణిక్యాలరావు- అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల మధ్య జరిగిన వాగ్వాదం మీడియాకెక్కడంపై, రాష్ట్ర అధ్యక్షుడు తమను మీడియా ఏజెంట్లు అన్న కోణంలో అనుమానించి, అవమానించడంపై సీనియర్లు నొచ్చుకుంటున్నారు. మన దగ్గర కొంతమంది జర్నలిస్టుల్లా వ్యవహరిస్తున్నారు. నిన్న పదాధికారుల సమావేశం మీడియాలో లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. మంత్రులు, వివిధ నాయకత్వాలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని హరిబాబు చేసిన వ్యాఖ్య సీనియర్లను మనస్తాపానికి గురిచేసింది. ఎండోమెంటు భూముల లీజు వ్యవహారంలో అది హిందువులదా? ఇతర మతాల వారిదా అని నిర్ధారించే అంశం ఎండోమెంటు కమిటీలకు కాకుండా చర్చిలకు ఇస్తారా? అని సుధీష్ రాంభొట్ల మంత్రి మాణిక్యాలరావును ప్రశ్నించారు. అయితే, ఆ విషయం తనకు తెలియదని, తాను తెలుసుకుంటానని చెప్పారు. అంతకుముందు.. అమరావతిలోని సదావర్తి భూముల వ్యవహారంపై విచారణ చేయాలంటూ విజయవాడ నగర అధ్యక్షుడి ఆధ్వర్యాన ధర్నా చేయడంపై, మాణిక్యాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉంటే మీరెలా ధర్నాలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో వాతావరణం వేడెక్కింది. దీనితో ఎమ్మెల్సీ సోము వీర్రాజు విజయవాడ నేతలను పిలిపించి, మందలించారు. మన పార్టీ వ్యక్తి మంత్రిగా ఉన్నప్పుడు ధర్నాలు చేయడం సబబు కాదని, దానివల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని నచ్చచెప్పారు.
అయితే, సదావర్తి భూముల వ్యవహారంలో చంద్రబాబు, తనయుడు, టిడిపి ఎమ్మెల్యే పాత్ర ఉందని విజయవాడ బిజెపి నేతలు సోమువీర్రాజుకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి విషయాల్లో సంయమనం పాటించాలని సోము సూచించారు. కాగా, రానున్న మున్సిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయి దృష్టి సారించాలని సమావేశం నిర్ణయించింది. తెదేపాతో పొత్తు కొనసాగుతున్నందున.. ఎన్నికలు జరిగే 7 కార్పొరేషన్లలో కచ్చితంగా రెండు కార్పొరేషన్లను పార్టీ తీసుకోవాలని, మరో రెండు కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లను తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. పొత్తులో సీట్లను టిడిపి చివరి వరకూ నానే్చ అవకాశం ఉన్నందున, ఎక్కడ బలంగా ఉంటే అక్కడ పొత్తులో ఆ స్థానాలను ముందుగానే తీసుకునేలా వ్యవహరించాలని నిర్ణయించారు.