ఆంధ్రప్రదేశ్‌

కాకినాడకు స్మార్ట్ హంగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 25: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఇక్కడ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును అమలుచేయనున్నట్టు కాకినాడ ఎంపి, లోక్‌సభలో టిడిపి ఫ్లోర్ లీడర్ తోట నరసింహం చెప్పారు. దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా గుర్తించగా వీటిలో 20 నగరాలను తొలుత స్మార్ట్ నగరాలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహించిన పోటీలో కాకినాడ ఎంపిక కావడం విశేషమని అన్నారు. నగరాభివృద్ధికై అధికార యంత్రాంగం రూపొందించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ నివేదిక కారణంగా ఈ అపూర్వ అవకాశం కాకినాడకు లభించిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో శనివారం కాకినాడ స్మార్ట్‌సిటీ ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి తోట మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద ఏడాదికి 200 కోట్ల వంతున ఐదేళ్లలో కాకినాడ నగరానికి వెయ్యి కోట్లు మంజూరు కానున్నట్టు చెప్పారు. ఇంతవరకు కాకినాడకు 186 కోట్లు లభించినట్టు తెలిపారు. పోర్టులు, రైల్వేలైన్ల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాకినాడ రైల్వే లైన్‌ను మెయిన్‌లైన్‌లో విలీనం చేసేందుకు కేంద్ర రైల్వే శాఖ 50 కోట్లు మంజూరు చేసిందని, మరో 50 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందని ఎంపి తెలియజేశారు. కాకినాడలో అధునాత పోర్టు నిర్మాణం అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని చెప్పారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కంప్యూటర్ ఆధారిత విద్యతో పాఠశాలల అభివృద్ధి, నగర ప్రజల భాగస్వామ్యంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం, స్థానిక ఇఎస్‌ఐ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలియజేశారు. ప్రజల భద్రత కోసం నగరంలో సిసి కెమెరా వ్యవస్థ, పరిశుభ్రమైన ఆహార పదార్ధాల విక్రయాలు, పాఠశాలల్లో ఈ-లెర్నింగ్, స్మార్ట్ తోపుడు బండ్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై రూఫ్‌టాప సోలార్ విద్యుత్ వ్యవస్థ, ఆకర్షణీయంగా నగరం కనిపించేందుకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనివ్వనున్నట్టు ఎంపి నరసింహం వివరించారు.

చిత్రం స్మార్ట్ తోపుడు బండిని ప్రారంభించిన ఎంపి తోట