ఆంధ్రప్రదేశ్‌

అన్ని వసతులూ కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 25: హైదరాబాద్ నుంచి తరలివచ్చిన వ్యవసాయశాఖ కమిషనరేట్ ఉద్యోగులకు భార్యాపిల్లలతో సహా స్థిరనివాసం ఏర్పర్చుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. గుంటూరులో ఏర్పాటుచేసిన వ్యవసాయశాఖ కమిషనరేట్‌ను శనివారం స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి మంత్రులు ప్రత్తిపాటి, రావెల కిషోర్‌బాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి విలేఖర్లతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఉన్న కమిషనరేట్‌కు దీటైన వాతావరణాన్ని ఇక్కడ కల్పిస్తామని, ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. ఎంపి గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, జివి ఆంజనేయులు కొమ్మాలపాటి శ్రీ్ధర్, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, వ్యవసాయశాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి పాల్గొన్నారు.
రైతులకు వాయిస్ మెసేజ్‌లు
రైతుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, పంటల సమాచారాన్ని వాయిస్ మెసేజ్‌ల ద్వారా ఇకపై అందించనున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్ కె ధనుంజయరెడ్డి తెలిపారు.
గుంటూరు వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో శనివారం రాష్ట్ర వ్యవసాయశాఖ, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కమిషనర్ ధనుంజయరెడ్డి వాయిస్ మెసేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ 4.25 లక్షల మంది రైతులకు పంటలకు సంబంధించిన సూచనలు, సలహాలు ప్రభుత్వ పథకాల వివరాలతో కూడిన వాయిస్‌మెసేజ్‌లు పంపనున్నట్లు చెప్పారు.

చిత్రం శనివారం గుంటూరులో వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. చిత్రంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు