ఆంధ్రప్రదేశ్‌

మే 9న ఎపి ఎంసెట్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: ఈనెల 29న జరిగే ఎంసెట్‌కు సకల సన్నాహాలు పూర్తయినట్లు ఎపి ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబా మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ ఏడాది ఎంసెట్‌కు మొత్తం 2.92 లక్షల మంది దరఖాస్తు చేశారని, ఇందులో ఇంజనీరింగ్‌కు 1.89 లక్షలు, మెడిసిన్‌కు 1.03 లక్షల మంది ఉన్నారని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించే ప్రసక్తే లేదన్నారు. పరీక్ష నిర్వహణకు మొత్తం 494 కేంద్రాలను ఏర్పాటు చేశామని, తెలంగాణలో 42వేల మంది కోసం 52 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షాకేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, వాచీలు, కాలిక్యులేటర్లు, ఎలాంటి ఎలక్ట్రానికి పరికరాలను అనుమతించేది లేదని, ప్రతి గదిలోనూ గోడ గడియారాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెల్‌ఫోన్లు పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.