ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్‌తో బాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి రాష్ట్ర పరిణామాలను వివరించారు. ప్రధానంగా గత పక్షం రోజులుగా వివాదాస్పదంగా ఉన్న వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా కేసులు, సింగిల్ జడ్జి తీర్పు, హైకోర్టు ప్రధానన్యాయమూర్తి ఆధ్వర్యంలోని ఫుల్ బెంచి తీర్పు, మండలి బుద్ధప్రసాద్ నాయకత్వంలోని సబ్ కమిటీ సిఫార్సులు, సభా హక్కుల కమిటీ సిఫార్సుల పత్రాలను గవర్నర్‌కు అందజేశారు. రోజా అంశంపై సభలో వెలుపల జరిగిన పరిణామాలను సిఎం వివరించారు. బడ్జెట్ , కేటాయింపులు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై గవర్నర్ సంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. వైజాగ్‌లో ఫైబర్ గ్రిడ్ , జల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన సారాంశం, ప్రభుత్వ చర్యలను గవర్నర్ అభినందించినట్టు తెలిసింది. కాగా అనేక రోజులు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో కూర్చుని అనేక వందల ఫైళ్లను క్లియర్ చేశారు. అంతకుముందు ఆయన తెలంగాణ టిడిపి నేతలతో సమావేశం అయ్యారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన హోళీ పండగ సందర్భంగా బంజారా మహిళలతో కలిసి నృత్యం చేయడంతో పాటు డప్పు వాయించారు.

చిత్రం... గవర్నర్ నరసింహన్‌ను కలిసిన సిఎం చంద్రబాబు