రాష్ట్రీయం

‘సర్వ శిక్షా’ ఆఫీసులో 14మంది అటెండర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 1: ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్‌లో రోజుకో అవినీతి అధికారి బండారం బట్టబయలవుతోంది. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఎఎస్ అధికారి శ్రీనివాస్ వచ్చిన నాటి నుండి ఒక్కో జిల్లాను సమీక్షిస్తున్న కొద్దీ అక్రమార్కుల చిట్టాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అనంతపురం ప్రాజెక్టు అధికారి దశరథ రామయ్య అవినీతి బండారం బయటపడింది. ఆయన ‘మన ఊరు- మన బడి’ పేరుతో 9 లక్షల రూపాయలు కైంకర్యం చేసినట్టు గుర్తించారు. అలాగే తన కార్యాలయంలో ఆయన 14 మంది అటెండర్లను రికార్డుల్లో చూపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా అంతమంది అటెండర్లు ఏకకాలంలో పనిచేయడం లేదని, జిల్లాలో పిఓ కార్యాలయంలో అంతమంది అటెండర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించడంతో అవినీతి బట్టబయలు అయింది. అలాగే బడిబయట పిల్లల కోసం వెచ్చించాల్సిన రెండున్నర కోట్ల రూపాయలు మురిగిపోయినట్టు గుర్తించారు. ఆర్ధిక లావాదేవీలకు సరైన రికార్డులు లేకపోవడాన్ని అధికారులు గుర్తించి, ఆయనను స్వీయ శాఖకు సరెండర్ చేస్తూ ఎస్‌పిడి ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్టు తెలిసింది. అలాగే ఆయన అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం. గతంలో గుంటూరు కార్యాలయంలో అనుమతి లేకుండా 60 లక్షల 25వేల రూపాయలు ఖర్చుపెట్టినట్టు తెలుసుకున్న ఎస్పీడీ కార్యాలయం అక్కడి పిఓ రమేశ్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. గుంటూరు పిఓతో పాటు అనుమతి లేకుండా నిధులు ఖర్చు చేసిన కడప, చిత్తూరు, నెల్లూరు పిఓలు, ఎఫ్‌ఎఓలను కూడా సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేసినట్టు రిపోర్టులు ఉన్నాయని, త్వరలో వాటికి సంబంధించి కూడా విచారణ జరుపుతామని సర్వశిక్షా అభియాన్ అధికారులు తెలిపారు.