ఆంధ్రప్రదేశ్‌

వడ్డాణాల్లా వారధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతికి వనె్న తెచ్చేలా నిర్మాణాలు
ప్రణాళిక రూపకల్పనకు సిఎం ఆదేశాలు
రాజధానిలో డ్రైవర్ రహిత ఎలక్ట్రిక్ బస్సులు
రూ.13 కోట్లతో అమరావతి సిటీ గ్యాలరీ ఏర్పాటు

విజయవాడ, ఏప్రిల్ 26: కృష్ణానది నుంచి రాజధాని అమరావతికి ఎన్ని వారధులు అవసరం అవుతాయో సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సిఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతికి చెంతనే ఉన్న కృష్ణానది, నగరానికి ప్రధాన ఆకర్షణగా చెబుతూ, ఆ నదిపై నిర్మించే వారధులు రాజధానికి మరింత వనె్న తెచ్చే ఆకృతుల్లో వుండాలని స్పష్టం చేశారు. కూచిపూడి ముద్రతో రెండతస్తులుగా నిర్మించే వారధితో పాటు మరెన్ని వారధులు ఎక్కడెక్కడ అవసరం అవుతాయో గుర్తించాలని అన్నారు. బుధవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. రాజధానిలో ఏ నిర్మాణాన్ని చేపట్టినా ప్రపంచంలోనే అత్యుత్తమం అని చెప్పుకునేలా వుండాలని సిఎం అభిప్రాయపడ్డారు. అమరావతి ప్రజా రవాణా వ్యవస్థలో చోదకుడు లేని విద్యుత్ బస్సులు, మెట్రో రైలు వుంటాయని తెలిపారు. తక్కువ దూరాలకు జలమార్గాలు వినియోగంలోకి తెస్తామని చెప్పారు. రాజధానిలో ఎక్కడికి వెళ్లాలన్నా కేవలం 30 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా ప్రజా రవాణా వ్యవస్థ వుండాలన్నారు. బస్‌స్టేషన్లు, మెట్రోరైలు స్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాలు, అండర్ గ్రౌండ్‌లో వుండేలా చూడాలన్నారు. నగరంలోని రహదారి వలయాలు వాహనాలు సులభంగా వెళ్లేందుకు వీలుగా శాస్ర్తియ పద్ధతిలో వుండేలా నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా సిటీలో నిర్మాణమయ్యే ఫ్లైఓవర్లు అమరావతి అందాన్ని రెట్టింపు చేసేంతగా ఆకర్షణీయంగా వుండాలన్నారు. రాజధానిలో సైకిల్, నడక మార్గాలలో ఎక్కడా ఎండ కనిపించకుండా నీడనిచ్చే పచ్చని చెట్లు వుండాలని చెప్పారు.
రూ.13.95 కోట్ల వ్యయంతో ‘అమరావతి సిటీ గ్యాలరీ’ని ఏర్పాటు చేస్తున్నామని సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. రాజధానికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం గ్రామంలో సుమారు 4.5 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామని తెలిపారు. దీన్ని నగరం నడిబొడ్డున ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అమరావతికి సంబంధించిన భూత, భవిష్యత్, వర్తమానాలలోని పరిణామాలకు అద్దం పట్టేలా దీన్ని రూపొందించాలని చెప్పారు. విజయవాడ నగరంలోని రాజీవ్ గాంధీ పార్క్, నది, కాలువల అభిముఖ ప్రాంతాల అభివృద్ధిపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వారధి నుంచి పవిత్ర సంగమం వరకు నదికి ఆనుకుని వున్న ప్రదేశాన్ని పూర్తిస్థాయిలో సుందరీకరించాలని, ఆ ప్రాంతంలో జలక్రీడలు, ఫుడ్ కోర్టులు, షాపింగ్ మాల్స్, ఎమ్యూజ్‌మెంట్ పార్క్, రోజువారీ ఎగ్జిబిషన్లు, ఫిట్‌నెస్ సెంటర్లు, ఓపెన్ ఆడిటోరియాలు, సాంస్కృతిక వేదికలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నగరానికి ఆవలివైపున వున్న ప్రదేశంలో సుమారు లక్ష జనాభాకు సరిపోయే 30 వేల ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. కొత్త రాజధాని ప్రాంతంలోని ఏదైనా ఒక పర్వత ప్రాంతంలో అక్షరధామ్ తరహాలో ఒక దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని తలపోస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో పురపాలక మంత్రి పి.నారాయణ, సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సిఎండి లక్ష్మీ పార్థసారధి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... సిఆర్‌డిఏ పనుల పురోగతిపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు