ఆంధ్రప్రదేశ్‌

సంధానంతో సంక్షోభం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌కు ఎగువనున్న నాగావళి- వంశధార- రుషికుల్య నదుల అనుసంధానంపై ఒడిశా చేపడుతున్న చర్యలు ఉత్తరాంధ్రకు ముప్పు తేబోతున్నాయి. ఈ అనుసంధాన ప్రక్రియను ఒడిశా సర్కార్ చకచకా పూర్తి చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నందిని శతపథి పేరిట నందినీ కెనాల్‌గా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు టెండర్లూ పిలిచేసింది. ఇది అమలైతే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ నదుల ప్రాజెక్టులపై ఆధారపడిన 3,32,250 ఎకరాలకు సాగునీటి సమస్య అనివార్యంగా కనిపిస్తోంది. దాదాపులక్షన్నర ఎకరాల వంశధార ఆయకట్టు భవిష్యత్ కూడా అయోమయంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంశధార - నాగావళి అనుసంధాన్ని ప్రకటించింది. నిర్మాణదశలో ఉన్న వంశధార రెండో దశలో భాగంగా, హిరమండలం రిజర్వాయర్ నుంచి నాగావళి ఎడమ తీరగ్రామాల వరకూ హైలెవల్ కెనాల్ నిర్మాణం ప్రతిపాదన ఉంది. ఈ కెనాల్‌ను నాలుగైదు కిలోమీటర్లు పొడిగించి నారాయణపురం ఆనకట్ట ఎగువన నాగావళితో అనుసంధానం చేసి చేతులు దులిపేసుకోవచ్చు. అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించకపోతే, నదుల అనుసంధానం ప్రచార ఆర్భాటమే అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి శ్రీకాకుళం జిల్లా నేతల వరకూ నాగావళి - వంశధార అనుసంధానంపై హామీలు గుప్పించారు. ఉత్తరాంధ్రలో జీవనదులు లేవు. వంశధార, నాగావళి మాత్రమే మధ్యతరహా నదులు. వీటి జన్మస్థానం ఒడిశాలోని కలహండి జిల్లా పరిధిలోని తూర్పుకనుమలు. వంశధార కాచ్‌మెంటు ఏరియా ఒడిశాలో 8915 చదరపు కిలోమీటర్లు కాగా, ఆంధ్రాలో (శ్రీకాకుళం జిల్లా) 2815 చదరపు కిలోమీటర్లు. నాగావళి కాచ్‌మెంటు ఏరియా ఒడిశాలో 8015 చదరపు కిలోమీటర్లు కాగా, ఆంధ్రాలో (విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు) 2815 చదరపు కిలోమీటర్లు. ఈ రెండూ అంతర్ రాష్ట్ర నదులు. అరగాణి ప్రాంతం (కాచ్‌మెంటు ఏరియా) 7700 చ.కి.మీ. గల రుషికుల్య నది ఒడిశాలోనే జన్మించి 165 కి.మీ ప్రవహించి, ఒడిశాలోనే గంజాం జిల్లా ఛత్రపూర్ దగ్గర సముద్రంలో కలిసే ఈ నది రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు తాగు, సాగునీరు అందిస్తోంది. వేగంగా కలుషితమవుతున్న ఈ నదిని కాపాడుకునేందుకు ‘రుషికుల్య బచావో’ ఉద్యమాలు జరుగుతున్నాయి. వంశధార నది ఆ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలో ప్రవహిస్తూ, ఒడిశా ప్రయత్నాల వల్ల, నదికి దిగవన గల శ్రీకాకుళం జిల్లాలో దాదాపు మూడు లక్షల ఎకరాలకు ముప్పు వాటిల్లుతుందన్న హెచ్చరికతో ‘సిక్కోల్ జలసాధన సమితి’ పేరుతో ఉద్యమం మొదలైంది. నాటి కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, కింజరాపు ఎర్రన్నాయుడు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఒడిశా ప్రయత్నాలకు గండి పడింది.
‘నాగావళి’తో మరో అడుగు..
కేంద్ర ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా తాజాగా, నాగావళిని కూడా అనుసంధానం చేయాలని ఒడిశా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇది ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నియోజక వర్గమైన ఆస్కా తీరంలో ఉండటం వల్ల దీనిపై ఆయన దృష్టి పెట్టారు.
ఆంధ్రాకు ముప్పు ఇలా..
నాగావళి, వంశధార రుషికుల్య కన్నా పెద్దనదులు. నదీజలాల ఒప్పందాల ప్రకారం నాగావళి, వంశధారల్లో చెరిసగం నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. నాగావళిపై బ్రిటిష్ పాలనా కాలంలో (1905-07) నిర్మించిన తోటపల్లి బ్యారేజీ, వంశధారపై 1970-77లో నిర్మించిన గొట్టాబ్యారేజీ కేవలం నీటిమళ్లింపు పథకాలే తప్ప నిల్వ చేసే రిజర్వాయర్లు కావు. ప్రస్తుతం రెండు నదుల నుంచి ఆంధ్రా జిల్లాలకు 3,32,250 ఎకరాలకు నీరందుతోంది. వంశధార రెండోదశ పూర్తయితే, మరో లక్షన్నర ఎకరాలకు నీరు అందాలి. ఎగువనవున్న ఒడిశా మూడు నదులను అనుసంధానం చేస్తే ఆంధ్రా జిల్లాలకు నీరు అందే అవకాశాలు పూర్తిగా ఉండవు. రెండు నదుల్లో కలిసే తొమ్మిది ఉపనదులు ఒడిశా పరిధిలోనే వున్నాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంశధార జల ఒప్పందం ప్రకారం నేరడి బ్యారేజీ నిర్మాణం ప్రారంభిస్తే 1980 నుంచి ఒడిశా అడ్డుకుంటోంది. ట్రిబ్యునల్ ఏర్పటు వరకూ సాగదీసింది. వరదనీటిని వాడుకోవడాన్నీ నిరోధిస్తూనే వస్తోంది. ఒడిశాకు భయపడి, నాగావళిపై తోటపల్లి కొత్త బ్యారేజీ డిజైన్‌ను ఆంధ్రా మార్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడుతూ రావడం దాని బలహీనతగా మారింది. తాజాగా మూడు నదుల అనుసంధాన యత్నాన్నీ గమనించడం లేదు. పరిస్థితి చేయిదాటితే..ఆంధ్రా రైతులకు గడ్డుకాలం తప్పదు.