Others

సకల సద్గుణ శోభితుడు.. రాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుగాది వచ్చిందటే మనకందరికీ మొట్ట మొదట గుర్తువచ్చేది దాశరథినే. ఉగాది వెళ్లిన వారంలోనే శ్రీరామ నవమి. త్రేతాయుగపు రాముడైనా సరే నిత్యమూ ఆయన స్మరణతోనే కాలం గడుపుతుండడం తెలుగువారికి సాధారణం. మనిషి, ఊరు, రాష్ట్రం, దేశం ఇవేకాదు ఆఖరికి పెంపుడు జంతువులకు కూడా రామ అన్న పేరును పెట్టుకొని ఆనందించడం భారతీయుల ప్రత్యేక లక్షణం. ఆధునికం అన్నా రామారావులు కనిపిస్తునే ఉంటారు.నవ్యనాగరికతతో కంప్యూటర్ యుగంలోకి వెళ్లినా సరే అక్కడా రామ్‌లు కనిపించనే కనిపిస్తుంటారు.
అసలు ఎందుకింతగా రాముడు ముద్ర వేశాడు మానవులపైన అని ఆలోచిస్తే ధర్మమే మూర్తిగా రూపొందాడు కనుక అన్న జవాబు నిత్యనూతనమై నిలుస్తుంది. రామాయణం పారాయణ చేసేవారు ప్రతి నలుగురిలో ఇద్దరు ఉంటారంటే అతిశయోక్తి కాదు. మరి రాముడు చేసిన ప్రతిపనీ ధర్మయుతమే కదా. రాముణ్ణి చూచి నాడే కాదు నేడు కూడా ప్రేరణ పొందేవాళ్లే ఎక్కువ.‘‘ రాతిని నాతిని చేసిన ఓ రామా నా బతుకుతెరువీ నావ.. దీన్ని మార్చకయ్యా రామా’’ అని గుహుని లాగా భయపడుతున్నట్టు కనిపించినా .. ‘‘రామా! నీకోసం వేయేండ్లు అయినా ఎదురు చూస్తూనే ఉంటాను..నీ సుందరరూపాన్ని చూచి నా కన్నులు ఆనందభాష్పాలు రాలుస్తాయి. నా చేత్తో నేనీ పండ్లను తినిపిస్తాను ’’ అని చెప్పే శబరులున్నా... ‘‘శరణు శరణు... నీవే తప్ప ఇతఃపరం బెరుగ రామా... రక్ష రక్ష ’’ అంటూ వచ్చిన విభీషణుణ్ణి ప్రజాభిప్రాయం తెలుసుకొని చివరకు తన అభిప్రాయానే్న అందరూ నచ్చేట్లుగా చేసి శరణాగతుణ్ణి రక్షించే నైపుణ్యరాముడ్ని తలుచుకునే వారేఎక్కువ. ‘‘ర’’ అనే అక్షరం వింటేనే నాకు ముచ్చెమటలు పట్తాయి.. నేను రాముని దగ్గరకు వెళ్లడమా.. ఆ రాముణ్ణి సర్వనాశం చేయాలన్న కోరిక విడువు.. చివరకు నీవే కాదు నీవంశమంతా సర్వనాశనం అవుతుంది అని హెచ్చరికలు వినిపించే శత్రుగణ గుండెల్లో నిద్రపోయే రాముడు నేడు అత్యవసరం అని మేధావులంటున్నారు.. దీనికి కారణం మన హిందూ జాతి గతవైభవాన్ని మరిచి పరుల సొమ్ముకు అంగలార్చే తన బిడ్డలను చూచి భూమాత రోదిస్తోంది. ప్రపంచానికే మకుటాయమానమైన హిందూ జాతి నిర్వీర్యవౌతుందేమోనన్న శంకతో భూదేవి కన్నీరు కారుస్తోంది.. అందుకే నాడు ఒక్క రాముడు పుట్టి ఒక్కరావణాసురుని మదం అణిచి సర్వ రాక్షసలోకాన్ని భయకంపితులను చేసినా నేడు ప్రతి ఇంటా రాముడుద్భవించాలి. అన్నింటా నేనునున్నా ననే కలిపురుషుడ్ని నేటి రాముళ్లు తెగటార్చాలి. ప్రతి పదమూ ధర్మయుతం కావాలి. ప్రతివారు ధర్మమూర్తులుగా నిలవాలి. హైందవజాతి పునర్వైభవాన్ని పున్మర్నించాలి. సర్వం విష్ణుమయం జగత్ అనే మనం మానవులందరినీ విష్ణుస్వరూపులుగా గుర్తించాలి. ఎదుటి వారి సంపద ఎంతెత్తునున్నా కన్న తల్లి, కన్ననేలతల్లి నే మిన్న అని చెప్పే రాముణ్ణి కలనైనా మరవరాదు. జననీ జన్మభూమిశ్చఅనే రామునికి మనం వారుసులుగా నిలవాల్సిన బాధ్యతమనపై ఉంది. దాన్ని రాబోయే తరాలకు తరగని మూటగా ఇవ్వాల్సిన కర్తవ్యమూ మనదే. సర్వప్రాణికోటి రాముని రూపులుగా భావించాలి. దాంపత్యధర్మానికి, భాతృప్రేమకు, మిత్రసంపదకు తార్కాణంగా నిలిచినా నాటి రాముణ్ణి ప్రతివారు తమ భావన లో అనుసంధానం చేసుకోవాలి. రామునికి మారురూపులుగా తయారుకావాలి. అపుడే భారతజాతి భూగోళంలో ఉన్నతస్థితిలో ఉంటుంది. మానవులందరూ రామతత్వానికి పునరంకితులు కావాలి.

- ఎస్. నాగలక్ష్మి