పర్యాటకం

మంగళకరుడు మంగళగిరివాసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిష్టరక్షణకు తన్ను తాను సృజించుకున్న అవతారుడే లక్ష్మీ నృసింహస్వామి. ఈస్వామి ఎక్కడైనా తన దైవత్వాన్ని ఎరుకపరుస్తునే ఉంటాడు. నాడు ప్రహ్లాదుడిని రక్షించటానికి స్తంభంలోంచి ఆవిర్భవించాడు. అటు నరరూపం కాక ఇటు మృగరూపం కాక, ఏ ఆయుధం లేకుండానే అంతలావు హిరణ్య కశ్యపుడిని ఆది అంతము లేనివాడిని లేడు లేడు అంటున్నావు ఉన్నాడు ఉన్నాడు ఎక్కడంటే అక్కడేనంటూ అవ్యక్తుడైనా తన నిజభక్తులకోసం వ్యక్తమవుతునే ఉంటాడు అని చెప్పడానికి పుట్టినవాడే నారసింహుడు.
కలండు కలండనేవాడు కలడో లేడో అని సంశయజీవులకు, ప్రాణ ముల్‌ఠావుల్ దప్పె- అఖిలరూపులకు తనరూపుఅయనవాడు, ఆది మధ్యాంతములు లేక అడరువాడు దీనుల పాలివాడు... వినడే చూడడే తలపడే వేగరాడే అనే ఆర్తితో పిలిచే జీవులను ఉద్ధరించడానికి తన్ను తాను మరిచి అలవైకుంఠపురంలో నగరిలో ఆమూలసౌధంబుదాపల ఉన్నా, లోకంబులు లోకేశులు లోకస్థులు లేనిచోట నిశ్చలంగా నిర్మలంగా ఏకాకృతితో వెలిగే సర్వేశ్వరుడు తానున్నానంటూ నడిచి వస్తాడని చెప్పే కథలెన్నో మనకు పురాణాలు చెప్తాయ.
ఆ సర్వేశ్వరుడైన ఈశ్వరుడే నరసింహుడై మంగళగిరిలో ఏంతెం చాడు. పానకాల రాయునిగా ప్రసి ద్ధికెక్కాడు. వేదాద్రిలో తన్ను కొలిచినవారికి తనతోపాటు స్నానం చేసిన పుణ్యాన్ని ప్రసాదించే ‘స్నానాలయ్య’గాఖ్యాతిపొందాడు. మట్టుపల్లిలో తన్ను సేవించిన వారింట అన్నానికి లోటువుండని విధంగా చేసే ‘అన్నలయ్య’ గా ప్రసిద్దమయ్యాడు. వాడపల్లి తన ఉనికి చాటుతూ తన ఉచ్ఛ్వాస నిస్వాసములవల్లే గర్భగుడిలోని దీపాలు కదులుతాయని నిక్కచ్చిగా చెప్పే దీపాలయ్యగా ప్రసిద్ధిచెందాడు. కేతవరం లో తన కోనేటిలో వజ్రాలను నిలిపి వజ్రాలయ్యగా కీర్తిగాంచినవాడు లక్ష్మీ నారసింహుడే. ఈ నారసింహుడు కొలువైన ఈ పంచ ఈ క్షేత్రాలు పంచనారసింహ క్షేత్రాలుగా ఉన్నప్పటికీ మంగళగిరి అలౌకికానందాన్నిచ్చే క్షేత్రంగా భాసిల్లుతోంది. లోకకంటకుడైన ‘సముచి’ రాక్షసుడిని సంహరించిన తర్వాత శ్రీ నృసింహస్వామి ఈ కొండపైన కొలువుదీరినట్లు కథనం. మంగళగిరి లోని ఆలయానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఊరిలో కొండపైన ఒక ఆలయం, పూరిలో మరొక ఆలయం ఉంటాయ. కొండపైన వున్న ఆలయంలోని గర్భాలయంలో గోడకు పెద్దగా తెరిచిన, నోరుతో స్వామి కొలువుదీరి దర్శనమిస్తారు. కొండపైన ఆలయం లోని స్వామిని మధ్యాహ్నం వరకే దర్శించుకోవచ్చు.
సాయంసంధ్యవేళల్లో దేవతలు మహర్షులు ఈ స్వామిని సేవించడానికి ఇక్కడి వస్తారని వారికి ఎట్టి ఇబ్బందులు కలుగకూడదని ఈ ఆలయంలోకి ఈవేళలో మానవులెవరూ రారని అంటారు. ఊరిలో ఉన్న ఆలయానికి 153 అడుగుల ఎత్తున గోపురం, విశాలమైన ప్రాంగణమూ చూపరులను ఆకర్షిస్తాయ. ప్రధాన గర్భాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు శాంతమూర్తిగా భక్తులకు దర్శనిమిస్తారు. స్వామి వామాంకాన లక్ష్మీదేవి కూడా భక్తులను కారుణ్యమూర్తియై నిలిచింది. మంగళగిరిలోని పానకాల స్వామిగా ఉన్న లక్ష్మీనారసింహుని దగ్గరకు ఎల్లవేళలా భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు.
ఈ స్వామిని దర్శించినవారికి, కోరి కొలిచినవారికి అనారోగ్యాలు దరిచేరవు. సత్‌సంతానం కలుగుతుంది. కోరిన సంపదలు ఒనగూడు తాయ. సర్వమంగళాలను ప్రసాదించే మంగళగిరి నారసింహుని దర్శనం సర్వ శుభకరం.

- సాయ కృష్ణ