Others

జీవన మార్గదర్శి.. గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీత మానవుణ్ణి మాధవుని స్థాయికి చేరుస్తుంది. భూతదయను పెంచుతుంది. సకల పర్రబహ్మ స్వరూపమని బోధిస్తుంది. సమ బుద్ధిని ప్రసాదిస్తుంది. సకలురను భగవంతుని అంశాలుగా చూడడానికి ప్రేరేపిస్తుంది. అటు వంటి గీత మనుష్యుల రాతలను మారుస్తుంది అంటే నిజమేకదా.. ఇహలోకంలోనే కాక భవబంధాల్ని తొలగిస్తుంది, ఆత్మసాక్షాత్కారమును కలిగిస్తుంది. శాంతిని అనుగ్రహిస్తుంది. అందుకే వారు వీరను తేడాల్లేకుండా గీత -దివ్య గీత అని కొనియాడుతుంటారు.
భారతీయులే కాక విదేశీయులై సైతం గీతను అనుసరించేవారే. వేదం చెప్పినట్టు సత్యం ఒక్కటే అయతే చెప్పేవారు విడమర్చి చెప్పడంలో పలువిధాలుగా కనిపిస్తుంది. పండితులైనవారు విద్వన్మమణులైన వారు ఆ సత్యాన్ని పామర జనానికి బాగా అర్థమయ్యేవిధంగాను, సాధారణులు సైతం అనుసరించేలాగా విశే్లషిస్తారు. వ్యాఖ్యానిస్తారు. అపుడే గీత వైశిష్ట్యం, విశ్వసనీయత జనులందరికీ సుబోధకవౌతుంది.
చెప్పేది సత్యమైతే ఏ దేశంలో, ఏ భాషలో, ఏ మతంలో చెప్పినా ఒక్కటే. ఈశ్వరుడు, మానవుడు, ప్రకృతి ఈ మూడు కూడా వేర్వేరుగా కనిపిస్తూ ఉన్నా అంతా ఒక్కటే. పరమేశ్వరుడు ఒక్కడే. ఆత్మ ఒక్కటే నైనా దేహాలు అనేకమైనట్టుగానే పరమేశ్వరుడు ఒక్కడే అయనా అనేకానేక రూపాలు, నామాలు ధరించి ఎవరి అభిరుచి మేరకు వారికి కనిపిస్తాడు. భావింపచేస్తాడు. కొన్ని అవతారాల్లో తాను భగవంతుడిని అని చెప్పలేదు. కాని తానే భగవంతుడినని తనను నమ్ముకొన్నవారి యోగ క్షేమాలను చూస్తానని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. అందుకే ఆ వంశీమోహనుడు బోధించిన గీతకు అంత విలువ. అట్లాఅని కృష్ణుడు ననే్న ధ్యానం చేయమని చెప్పలేదు. నిన్ను నీవు ఉద్దరించుకోవాల్సిందే కాని మరెవరో వచ్చినిన్ను బాగుచేయరు అని నిర్మొహమాటంగా ఉద్ధరేదాత్మనాత్మానం (6-5) చెప్పాడు.ఈ మాట చెప్తూనే అశాన్తస్యకుతస్సుఖమ్ (2-66) అంటాడు అంటే మనసున శాంతి లేకుండా అసలేపనీ చేయలేము. కనుక ముందు నీవు శాంతిని పొందు తర్వాత అంతాబాగానే ఉంటుంది అంటాడు. కోపాన్ని జయంచడం, అహంకారాన్ని దూరం చేయడం లాంటి గుణాలను దూరం చేసుకోగలిగితే మనలో స్వార్థచింతన లేకుండా, అసూయా ద్వేషాలు లేకుండా ఉన్న దానితో తృప్తి పొందేగుణం ఉంటే శాంతి దానికదే వస్తుందిగా. క్షణం కూడా ఆలోచన లేకుండా ఉండలేనటువంటి గుణమున్న మానవుణ్ణి పనినే యోగంగా చేయమని ప్రోత్సహిస్తాడు. ఆ చేసేపనినే యోగః కర్మ సుకౌశలమ్ కర్మయందు నేర్పునే యోగమంటారు అంటాడు. కేవలం నీవు చేయాల్సిన పనిని చేస్తూ ఉండు.. ఫలితాలను ఆశించకు.. సంతృప్తితో ఉండు అనిచెప్పే భగవద్గీతను అనుసరిస్తే నహి కల్యాణ కృత్కశిచద్దుర్గతి తాతగచ్ఛతి మంచి కార్యాలు చేసేవారికి మంచి ఫలితాలే వస్తాయగా. మరి అటువంటపుడు ఫలితంపై చూపు అక్కర్లేదు. చేసే పనిలో నైపుణ్యమలవర్చుకుంటేచాలు. భగవంతుడే యోగక్షేమాలు చూస్తాడనే గీతను మనం అనుసరిద్దాం. మన రాతలను నీటిమీద కాక నుదుటి మీద వ్రాయంచుకుందాం.
‘‘సర్వ భూత హృదయ స్థితుడైన ఆత్మను నేనే. సర్వ భూతాలకు అది మధ్యాంతాన్ని నేనే. ‘‘ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, తాతను, వేద్యుణ్ణి, పవిత్ర ఓంకారాన్ని, ఋగ్‌సామ యజుర్వేదాల్ని’’ ‘‘అఖిల జగత్తు భావింపజేసే అర్కద్యుతి, చంద్రకాంతి, అగ్నిజ్వలనం- ఇవన్నీ నా తేజస్సేనని తెలుసుకో అని చెప్పే భగవంతుడిని అన్నింటిలోను చూచే సౌభాగ్యాన్ని సమబుద్ధిని సంపాదిద్దాం.

- హనుమాయమ్మ